భరత దేశం చూడరన్న- భవ్య గీతం పాడరన్న
తెలంగాణ మనదిరన్న- తెలుగు కీర్తిని చాటరన్న..॥భరత॥
తెలంగాణ తెలుగు భాష-సాటిలేని మేటి భాష
పలికినంతనె రుచుల నొలుకు-మాతృభాష మన తెలుగు..॥భరత॥
బమ్మెర పోతనామాత్యుని-భక్తి సుధలు వెల్లి విరియగ
పాల్కురికి సోమనాధుని-పసిడి పల్కులు పరిడ విల్లగ
తెలుగు భాషకు సేవ చేసిరి-తెలుగు కీర్తిని చాటి చెప్పిరి…॥భరత॥
తెలంగాణ తెనుగు తోటలో-చిన్నగూడూరు గూటిలోన
విరబూసిన ధీర కవులు-ప్రజాకవులు దాశరథులు
మానుకోటకు పేరుదెచ్చిన-మహాను భావులు మన దాశరథులు
అగ్నిధార రుద్రవీణతో-అక్షరాయుధం చేతబూని
నా తెలంగాణ కోటి రతనాల వీణని- చాటిన చైతన్య శీలురు..॥భరత॥
విశ్వంభర కావ్యరచనతో-జ్ఞానపీఠ పురస్కారంతో
విశ్వాంతరంలో వెలగినట్టి-తెలంగాణ ముద్దుబిడ్డ
మనసింగిరెడ్డి నారాయణరెడ్డి- పలుకుబడుల భాషనాది
వీర తెలంగాణ నాది- పోరుతెలంగాణ నాది…॥భరత॥
నా గొడవతో గొడవపెట్టి-నిజాం రాజును ఎదిరించి
నిరంకుశ పాలనపై-కలంపట్టి గలం ఎత్తి
ప్రజలకండగ నిలిచినట్టి-ప్రజాకవి మన కాళోజీ… ॥భరత॥
తెలంగాణ మట్టి పరిమళం-వ్యాస సుధలతో పంచినట్టి
రామప్ప రభస పలుకులతో-రంగరించి స్ఫూర్తి నింపిని
ప్రజల మనిషి వట్టికోట-మనవాడే తెలంగాణ ముద్దుబిడ్డ ॥భరత॥
తెలంగాణ తల్లి మెడలో-జయ జయ నాదాల దండలు
తెలంగాణ ముద్దుబిడ్డలు- ఎందరో అందరికీ వందనాలు…॥భరత॥
– గుండు రవి, 99850 72292