సజీవ చిత్రం
చిగురించిన మామిడిచెట్టులా విరగబూసిన వేపపూతలా తెలంగాణ యాస ఎదలో సప్పుడై ఇనవడుతది...
చిగురించిన మామిడిచెట్టులా
విరగబూసిన వేపపూతలా
తెలంగాణ యాస
ఎదలో సప్పుడై ఇనవడుతది…
జానెడు బట్టల అందాలు లేవు
తీన్మార్ స్టెప్పులు లేవు
తీరొక్క పల్లె జీవనం ఉట్టిపడుతుంది…
కట్టుబాట్లు
తెగ ఉద్వేగంతో దర్శనమిస్తాయి..
తీరొక్క చెట్లకు గాసిన
కూరగాయలన్నీ కలగూరలో
కలిసి మెలసినట్టూ..
మెత్కులుగా ఉడికించిన
ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా
పిడికిలిలో ఒకటైన
బువ్వముద్దల సంస్కృతి
పచ్చటి ఇస్తరాకుపై
పరుచుకున్నా
పల్లెజీవనం కనవడుతుంది..
చియ్యకూరల రుచి
మూలుగు బొక్కలపై ఉన్న అభిరుచి
చింతచెట్టు నీడలో
కాలం ఎల్లపోసిన దినాలు…
ఎట్ల మరుతుము
గొర్రె కోయలు
పడమటికి వాలంగానే
దుడుక్కుమని లేసి
దిగమింగిన సుద్దులన్నీ….
యాది మర్వలేము
కానుగ చెట్టు
ఎండాకాలంలో చిగురించినట్టు
ఎదనిండుగా నీడను
పల్లె ఎరుక జేస్తది..
సంబురం అనగానే
దండలోని దారాన్ని
హత్తుకున్న మల్లెలా
ఊరు జనమంతా రచ్చకట్ట కాడికి చేరి
చెప్పుకున్న సుద్దులను ఎరుకజేస్తది….
మీసాలు మెలేసిన తాతయ్య
మాసం బంగారం పెట్టి
మెట్టినింటికి సాగనంపిన తీరు..
పల్లెను కన్నీరు వెట్టిస్తది
ఆవులమంద నుంచి విడదీయబడిన
పెయ్యదూడ బాధను గుర్తుచేస్తది…
అన్నదమ్ముల అనుబంధాన్ని
అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని
బావా బామ్మర్ధుల బంధాన్ని
బావ మరదండ్ల మూగ భాషని
అన్నిటిని కలగలిపిన
ఉగాది పచ్చడిలా ఎరుక జేస్తది….
బలగం ప్రేమానురాగాల
అనుబంధం
బలగం పల్లె జీవన
విధానానికి తార్కాణం
బలగం తెలంగాణ
యాస భాషల మమకారం
బలగం ఈ భూమిపై
కదలాడే ఓ సజీవ చిత్రం
- ఉప్పరి తిరుమలేశ్
9618961384
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

