నీడనిచ్చి నిద్రబుచ్చే
మా ఇంటికి నీవే కావలి
మెతుకునిచ్చి బతుకునిచ్చే
మా పొలానికి నీవే కావలి
రాగఝరుల అనురాగసిరుల
పల్లెకి నీవే కావలి
యాగయోగ త్యాగ భోగ
సంస్కృతికి నీవే కావలి
ధైర్య శౌర్య క్రౌర్య
కార్య రక్తసిక్త చరిత్రకి నీవే కావలి
కడుపులో కుళ్లు ముళ్లు
మాటలో తేనెగుళ్లు ఎవడికి కావాలి
అస్తిత్వమే ఆస్తి
చాప కింద నీరై వెన్నుపోటు దారై
దగా చేయు దోస్తీతో కుస్తీ
-కోటం చంద్రశేఖర్
94920 43348