ఎక్సర్సైజ్@55
వ్యాయామం చేయాలి అన్నది కొందరికి జీవితకాల లక్ష్యంగా మిగిలిపోతుంది. చిన్న వయసులో కాలేజీ, ఆ తర్వాత ఆఫీసు, ఇంకాస్త ముందుకెళితే పెండ్లి, పిల్లలు,స్కూళ్లు... తిరిగి చూసుకునే సరికి యాభయ్యో పడిలో పడిపోతారు చాలామంది ఆడవాళ్లు. ఆ తర్వాత క్రమం తప్పని వ్యాయామం అన్నది ఓ కలలా కనిపిస్తుంది.
వ్యాయామం చేయాలి అన్నది కొందరికి జీవితకాల లక్ష్యంగా మిగిలిపోతుంది. చిన్న వయసులో కాలేజీ, ఆ తర్వాత ఆఫీసు, ఇంకాస్త ముందుకెళితే పెండ్లి, పిల్లలు,స్కూళ్లు… తిరిగి చూసుకునే సరికి యాభయ్యో పడిలో పడిపోతారు చాలామంది ఆడవాళ్లు. ఆ తర్వాత క్రమం తప్పని వ్యాయామం అన్నది ఓ కలలా కనిపిస్తుంది. కానీ, ఇది అస్సలు వాస్తవం కాదంటున్నారు ఆరోగ్యనిపుణులు. సగం జీవితంలో వ్యాయామం మొదలుపెట్టి సంపూర్ణ జీవితానికి హామీ ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించిన ఆ ఆరోగ్య రహస్యాన్ని మనమూ తెలుసుకుందాం!
మనిషి ఆరోగ్యంగా ఆనందంగా జీవితాన్ని గడపాలంటే ఏం చేయాలి అన్నది… ఎప్పుడూ ఆసక్తికర అంశమే. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాము చేసిన అధ్యయనాల సారాంశాన్ని వాళ్లంతా ఎప్పటికప్పుడు జనానికి చేరవేస్తూనే ఉంటున్నారు. వాటి ఆధారంగా మనుషుల జీవితాల్లోనూ అనేకానేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి కూడా. అయితే, ఇటీవల పీఎల్ఓఎస్ మెడిసిన్ అనే మెడికల్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం ఒక ఊహించని అంశాన్ని బయటపెట్టింది.
మహిళలు తమ 55వ సంవత్సరంలో కూడా రోజువారీ వ్యాయామాన్ని ప్రారంభించవచ్చనీ, అది వార్ధక్య సమస్యల్ని దూరం చేసి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో తోడ్పడుతుందన్నది దాని సారాంశం. ఇందుకోసం స్త్రీలు వారానికి సగటున 150 నిమిషాల పాటు వర్కవుట్ చేయాలని సూచించింది. వారమంతా క్రమం తప్పకుండా కనీసం ఇన్ని నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల అత్యధిక ఫలితాలను సాధించవచ్చని వెల్లడించింది. అలాగే 45 నుంచి 50 ఏండ్ల మధ్య ప్రారంభించినా దీర్ఘకాలంలో గొప్ప ప్రభావం ఉంటుందని కూడా చెప్పింది. రోజువారీ వ్యాయామం అన్నది ఎంతముందు ప్రారంభిస్తే అంత మంచిదే అయినా, 55 ఏండ్లకు మొదలుపెట్టడం అన్నది కూడా కసరత్తులు ప్రారంభించడానికి చక్కని ప్రభావవంతమైన వయసు అని తేల్చింది.
- వారానికి 150 నిమిషాల వ్యాయామం ఎలా చేయవచ్చు అన్నదాన్ని ఆరోగ్యనిపుణులు కొన్ని విభాగాలుగా సూచించారు.
- మోస్తరు నుంచి కష్టతరమైన ఏరోబిక్ కసరత్తులు, కండరాలను పటిష్ఠం చేసే వ్యాయామాల కలబోతగా దీన్ని
రూపొందించుకోవాలి. - వేగవంతమైన నడక (బ్రిస్క్ వాకింగ్), సైక్లింగ్, వాటర్ ఏరోబిక్స్, డబుల్ టెన్నిస్‌లాంటివి మోస్తరు నుంచి కష్టతరమైన వ్యాయామాల కిందకి వస్తాయి.
- బరువులు ఎత్తడం, చున్నీ లేదా టవల్లాంటి వాటితోనూ చేయగల బ్యాండ్ ఎక్సర్సైజులు, స్వాట్లు, పుష్అప్ల లాంటివి కండరాలను బలోపేతం చేసేవాటి కిందకి వస్తాయి.
- రోజూ అరగంట పాటు కాస్త కష్టమైన ఎక్సర్సైజులు అయిదు రోజులపాటు చేసి, మరో రెండు రోజులు కండరాలకు సంబంధించిన వ్యాయామం చేయడం ద్వారా మరింత మంచి ఫలితాలను అందుకోవచ్చు. దీనివల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరగడమే కాదు మిగతా శరీరమూ దృఢంగా తయారవుతుంది.
వీటితో జాగ్రత్త
శారీరక శ్రమ పెంచుకోవాలని అనుకున్నప్పుడు హృదయ సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు తప్పక నిపుణులను సంప్రదించాలి. ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చో తెలుసుకోవాలి. కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్లాంటి ఎముకల సమస్యలు ఉన్నవాళ్లు ఈత, సైక్లింగ్‌లాంటి తక్కువ ఒత్తిడి కలిగించే వ్యాయామాలు ఎంచుకోవాలి. క్రమంతప్పని వ్యాయామం మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. కానీ, ఎప్పటికప్పుడు దాని స్థాయులను పరిశీలిస్తూ వ్యాయామాలు చేయాలి. దీర్ఘకాలిక నడుమునొప్పిలాంటివి ఉన్నప్పుడూ నిపుణుల సలహా తప్పనిసరి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

