శభాష్ రాధిక!.. హైదరాబాద్ విమానాశ్రయంలో తొలి మహిళా ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్
మహిళలు అన్ని రంగాల్లోనూ అడుగుపెడుతున్నారు అని చెప్పుకొంటున్నామే కానీ... ఇప్పటికీ చాలాచోట్ల వారి ఉనికే ఉండటం లేదు. కఠినమైన, బరువైన పనులకు వారిని ఇప్పటికీ దూరం పెడుతున్నారు. అలాంటి ఒక రంగమే ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్. నైపుణ్యంతో బరువైన కార్గోలను ఎత్తి, తరలించేవారే ఈ ఆపరేటర్లు.
మహిళలు అన్ని రంగాల్లోనూ అడుగుపెడుతున్నారు అని చెప్పుకొంటున్నామే కానీ… ఇప్పటికీ చాలాచోట్ల వారి ఉనికే ఉండటం లేదు. కఠినమైన, బరువైన పనులకు వారిని ఇప్పటికీ దూరం పెడుతున్నారు. అలాంటి ఒక రంగమే ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్. నైపుణ్యంతో బరువైన కార్గోలను ఎత్తి, తరలించేవారే ఈ ఆపరేటర్లు. హన్మకొండకు చెందిన శ్రీరామోజు రాధిక, ఇప్పుడు ఈ పరిమితిని అధిగమించారు.
హైదరాబాద్ విమానాశ్రయంలో తొలి మహిళా ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్‌గా రికార్డు సృష్టించారు. పదో తరగతి వరకు మాత్రమే చదివిన రాధిక మీద ఇద్దరు పిల్లల బాధ్యత ఉంది. ‘ఆదాయం కోసం కుట్టుపని లాంటి ఉపాధి ఎంచుకోవచ్చు కదా!’ అని చాలామంది సలహా ఇచ్చారు. కానీ, ఏదైనా వైవిధ్యమైన రంగంలో అడుగుపెడితే పోటీ తక్కువే కాకుండా తన ప్రత్యేకత కూడా చాటినట్లు అవుతుందని భావించారు రాధిక.
తన ఆశయానికి అండగా నిలుస్తూ జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, రాధికకు ఫోర్క్ లిఫ్టింగ్‌కి అవసరమైన శిక్షణ అందించింది. ఈ కఠినమైన శిక్షణను దాటుకుని, సందడిగా ఉండే హైదరాబాద్ విమానాశ్రయంలో ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్‌గా ఉద్యోగం సంపాదించారు. ‘సంకల్పం ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు’ అంటారు రాధిక. నిజమే కదా!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

