హెడ్ఫోన్లు పెట్టుకుని పాటలు విన్నా, కాల్స్ మాట్లాడినా మనకు కావలసింది శబ్దంలో స్పష్టత. అది ఎంత బాగా ఉంటే మనం అంత హాయిగా ఎంజాయ్ చేయగలం. ఎలక్ట్రానిక్ సంస్థ ట్రూక్, ‘క్లారిటీ 5’ పేరుతో ఇటీవల ఒక హెడ్‌సెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మన మాటలు అత్యంత స్పష్టంగా వినిపించడం ఇందులోని ప్రత్యేకత. వీటిలో ఉండే సిక్స్ మైక్స్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ కాన్సిలేషన్ టెక్నాలజీ చుట్టుపక్కల ఉన్న శబ్దాలు వినిపించకుండా మన మాట మాత్రమే వినిపించేలా చేస్తుంది. అవతలి గొంతునూ స్పష్టంగా వినగలిగేలా పని చేస్తుంది. దీనిలోని బ్లూటూత్ సాయంతో ఫోన్‌తో పాటు ట్యాబ్ లేదా కంప్యూటర్‌కు కూడా ఒకేసారి కనెక్ట్ అవ్వచ్చు. అంటే మనం ల్యాప్‌టాప్‌లో సినిమా చూస్తున్నాం. మరోవైపు కాల్ వచ్చింది. వెంటనే సినిమా ఆపి కాల్ మాట్లాడొచ్చన్నమాట. ఒకసారి చార్జింగ్ పెడితే పది గంటల పాటు పనిచేస్తుంది. ధర 1,499 రూపాయలు. truke.inలో వీటిని అమ్ముతున్నారు.
పండగలూ, ప్రత్యేక సందర్భాల కోసం ఆడపిల్లలకు బోలెడు డ్రెస్సులుంటాయి. లాంగ్ గౌన్లు గాగ్రాల నుంచి లంగావోణీ చీరల దాకా సందడి చేసే దుస్తులెన్నో వరసకడతాయి. కానీ కాస్త పెద్ద వేడుకకు కొత్తగా వేసుకోవాలంటే అబ్బాయిలకు అసలైన ఆప్షన్ షేర్వాణీ ఒక్కటే. దానికి కాస్త వెరైటీ జోడిస్తే ఎప్పుడూ వేసుకునే డ్రెస్సే కదా అనిపించదు. అందుకే జేడ్ బై ఎంకే సంస్థ ‘ఆయాజ్ కోట్’ పేరిట టూ పీస్ షేర్వాణీని రూపొందించింది. కుర్తీపై కోటు ఉన్నట్టుగా విభిన్నంగా కనిపించే దీనికి అడుగున కోటుకన్నా భిన్నమైన అస్తరును వేశారు. లోపలి, బయటి చొక్కాలకు ప్రత్యేకంగా కనిపించేలా పైపింగ్ చేశారు. దీనికి తెలుపు రంగు స్లిమ్‌ఫిట్ ప్యాంటు జోడించారు. మొత్తంగా చూడగానే ఫ్యాషనబుల్‌గా, విభిన్నంగా కనిపించే ఈ షేర్వాణీ సెట్ ధర రూ.96,400. jadebymk.com ద్వారా కొనుగోలు చేయొచ్చు.
పక్షిలా గాలిలో విహరిస్తూ ఫొటోలూ, వీడియోలూ తీసే డ్రోన్లనే మనం చూశాం. కానీ నీటిలో చేపలా ఈదుతూ అక్కడి అందాలను బంధించే డ్రోన్లూ ఇప్పుడు వస్తున్నాయి. ‘ఓషన్‌ఐ’ పేరుతో యు కేన్ రోబోటిక్స్ సంస్థ రూపొందించిన డ్రోన్ అలాంటిదే. మహా సముద్రపు నీటి ఒత్తిడిని సైతం తట్టుకునే దీనికి 4కె రిజల్యూషన్ కెమెరాతో పాటు, హై, లో బీమ్ల ఎల్యీడీ లైట్లు ఉంటాయి. దీనివల్ల సముద్రపులో లోతుల్లో
మసకగా ఉండే చోట్లా వీడియోలు, ఫొటోలు తీయగలదు. 100 మీటర్ల లోతు వరకూ వెళ్లి, డైవర్లు కూడా చేరుకోలేని ప్రాంతాలను చూపించగలదు. 360 డిగ్రీల కోణంలో ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. జాయ్ స్టిక్లాంటి రిమోట్ సాయంతో నియంత్రించవచ్చు. ఆ దృశ్యాలన్నీ ఫోన్ ద్వారా చూడొచ్చు. ఒకసారి చార్జింగ్ పెడితే అరగంట పాటు పనిచేస్తుంది. ఇందులో 64 జీబీ మెమరీ ఉంటుంది. దీనికి ఉండే చిన్ని చేతుల్లాంటి అమరిక సాయంతో చిన్నా చితకా వస్తువులను, లేదా అక్కడి నీళ్లను పైకి తీసుకురాగలిగే అవకాశం ఉంది. ధర రూ.4.6 లక్షలు. youcanrobotics.com ద్వారా ఖరీదు చేయవచ్చు.
ప్రముఖ ఫ్రెంచి లగ్జరీ ఫ్యాషన్ సంస్థ లూయీ విటోన్ తనదైన శైలిలో నగలనూ తయారు చేస్తున్నది. ఇటీవల ఈ బ్రాండ్ నుంచి ‘గ్రేస్’ పేరిట విభిన్నమైన డిజైన్‌తో ఒక వజ్రాల నెక్లెస్ మార్కెట్లోకి వచ్చింది. బుగాటీ కట్‌గా పిలిచే ఒక ప్రత్యేకమైన కటింగ్ పద్ధతిని దీనిలోని వజ్రాలను మలిచేందుకు వాడారు. గ్రీకు కథల్లో కనిపించే ఫొనిక్స్ పక్షిని పోలిన ఆకృతిలో ఈ నెక్లెస్‌ను రూపొందించారు. మెడలో అందంగా అమరేలా, రెండు ‘వి’ అక్షరాల కలయికగా దీన్ని డిజైన్ చేశారు. గొలుసులోని డిటాచబుల్ పెండెంట్ తయారీకి తూర్పు ఆఫ్రికా గనుల్లో లభ్యమైన 65 క్యారెట్ల పచ్చను ఉపయోగించారు. అపార నైపుణ్యం కలిగిన శ్రామికులు రెండువేల గంటల పాటు కష్టపడితేనే ఈ గొలుసు తయారవుతుంది. మరిన్ని వివరాలకు louisvuitton.comలో వెళ్లాలి.