రోజుకో కొత్తరకం స్మార్ట్‌వాచీ మార్కెట్‌ను ముంచెత్తుతున్నా.. సంప్రదాయ అనలాగ్ వాచీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అందులోనూ అమ్మాయిల కోసమైతే.. ఎన్నో డిజైన్లు, ఎన్నెన్నో వెరైటీలు! వాచీల తయారీలో అగ్రగామిగా ఉన్న దేశీయ కంపెనీ టైటాన్.. నేటితరం యువతులను దృష్టిలో పెట్టుకొని ‘వర్ష’ పేరుతో సరికొత్త వాచీల కలెక్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. స్వచ్ఛమైన 18 క్యారెట్ల బంగారంతో చేసిన వాచీ పట్టీలపై, వజ్రాలను పొదిగి.. ఈ లగ్జరీ వాచీలను తయారుచేసింది. హస్తకళలను ప్రోత్సహించేలా పూర్తిగా చేతితోనే ఇవి రూపుదిద్దుకున్నాయి. అణువణువునా భారతీయత ఉట్టిపడే ‘వర్ష’ గడియారాలు.. సంప్రదాయ వస్ర్తధారణను మరో మెట్టు ఎక్కిస్తాయి. అన్ని రకాల ఫ్యాషన్ డ్రెస్సులకూ నప్పుతాయి. ఈవెంట్ ఏదైనా.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచే ఈ లగ్జరీ వాచీ ధర రూ.4.24 లక్షలు. titan.co.in ద్వారా కొనుగోలు చేయవచ్చు.
యాపిల్, సామ్సంగ్ లాంటి సంస్థలు.. ఫోన్లతోపాటు చార్జర్లను ఇవ్వడం లేదు. వాటిని ప్రత్యేకంగా కొనుగోలు చేసుకోవాల్సి వస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం స్మార్ట్‌ఫోన్ కోసమే కాకుండా, ట్యాబ్, ల్యాప్‌టాప్ లాంటి ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకూ ఉపయోగపడేలా చార్జర్‌ను కొనుగోలు చేయడం మంచిది. అలాంటి వారికోసమే ఆంబ్రేన్ సంస్థ ఓ కొత్త చార్జర్‌ను తీసుకొచ్చింది. ‘ఆంబ్రేన్ రాప్ జీ150’ పేరుతో వచ్చిన ఈ చార్జర్.. 150 వాట్స్ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ వల్ల 30 నిమిషాల్లోనే ఐఫోన్‌ను 50 శాతానికి పైగా చార్జ్ చేస్తుంది. ఈ చార్జర్‌లో ఒక యూఎస్బీ-ఏ పోర్ట్‌తోపాటు రెండు యూఎస్బీ-సీ పోర్టులు ఉన్నాయి. దీనివల్ల ఒకేసారి మూడు పరికరాలనూ చార్జ్ చేసుకునే వీలు కలుగుతుంది. దీని ఖరీదు రూ.6,499. ambraneindia.comతోపాటు అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
చలికాలంలో పిల్లలకు గోరువెచ్చని నీరు తాగించాలని ఆరోగ్యనిపుణులు చెబుతారు. ఇక పెద్దలైతే.. ప్రతి అరగంటకూ టీనో, కాఫీనో కావాలంటారు. ఈ రెండు అవసరాలనూ తీర్చాలంటే.. ఇంట్లో ఓ కెటిల్ ఉండాల్సిందే! ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ హావెల్స్.. ‘ఐ-కానిక్ డిజీ కెటిల్’ పేరుతో సరికొత్త కెటిల్‌ను తయారుచేసింది. 1.5 లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ కెటిల్.. నీటిని వేడిచేయడంతోపాటు 90 నిమిషాలపాటు ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. టచ్ కంట్రోల్, ఎల్ఈడీ డిస్ప్లే లాంటి అదనపు ఫీచర్లూ ఉన్నాయి. డబుల్వాల్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ వల్ల.. లోపలి నీరు వేడిగా ఉన్నప్పటికీ, బయటికి మాత్రం చల్లగా ఉంటుంది. నీళ్లు, టీ, కాఫీలకు దేనికి తగినట్టుగా దానికి ఉష్ణోగ్రతలను మార్చుకునే వీలుంది. 1600 వాట్స్ పవర్‌తో పనిచేయడం వల్ల క్షణాల్లోనే నీటిని వేడిచేస్తుంది. ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ కారణంగా నీళ్లు సరిపడా మరిగిన తర్వాత దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. కెటిల్‌లోని వేడినీళ్లు ఒలికిపోకుండా ఉండేలా దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రెండు సంవత్సరాల వారంటీతో వస్తున్న ఈ కెటిల్ ధర. రూ.5,999. havells.com తోపాటు ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.
ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన వస్తువుల్లో రిఫ్రిజిరేటర్ ఒకటి. వాతావరణంలో వేడి పెరిగిపోతున్నది కాబట్టి.. రిఫ్రిజిరేటర్ల వాడకం కూడా పెరిగింది. ఆధునిక గృహ అవసరాల కోసం గోద్రెజ్ సంస్థ.. 670 లీటర్ల కెపాసిటీతో ఫోర్ డోర్స్ రిఫ్రిజిరేటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా.. కస్టమైజ్ చేసుకునేలా ఈ ‘గోద్రెజ్ ఈఆన్ వెల్వెట్ రిఫ్రిజిరేటర్’ను తీర్చిదిద్దింది. ఫ్రీజర్ నుంచి ఫ్రిజ్‌కు.. ఫ్రిజ్ నుంచి ఫ్రీజర్‌కు మార్చుకునే సౌకర్యాన్నీ కల్పించింది. -18 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను ఈ ఫ్రిజ్ మెయింటేన్ చేస్తుంది. ఇందులో సూపర్‌కూల్, హాలిడే, సూపర్ ఫ్రీజ్.. అనే మూడు ఇంటెలిజెంట్ మోడ్స్ ఉంటాయి. ఇవి అవసరాలకు తగ్గట్టుగా రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలను మార్చేస్తాయి. విద్యుత్ వినియోగాన్నీ తగ్గిస్తాయి. ఈ రిఫ్రిజిరేటర్ ధర. రూ.1.20 లక్షలు. godrej.com ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.