House of Chikankari | ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా కాదు.. అచ్చమైన ఐడియాల ఫ్యాక్టరీ
ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా కానేకాదు. అచ్చమైన ఐడియాల ఫ్యాక్టరీ. కొవిడ్ సమయంలో ఎంతోమంది పిచ్చిపిచ్చి ఆలోచనలతో బుర్ర పాడుచేసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఆ తల్లీకూతుళ్లు మాత్రం.. కొత్త వ్యాపారం గురించి ఆలోచించారు. ఆ ఇద్దరి పేర్లు.. పూనమ్ రావల్, ఆకృతి రావల్. పూనమ్‌కు ముందు నుంచీ చేనేతలంటే ఇష్టం. ఆ ప్రత్యేక అభిరుచి ‘హౌస్ ఆఫ్ చికన్‌కారీ’ ఏర్పాటు వైపుగా అడుగులు వేయించింది.
House of Chikankari | ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా కానేకాదు. అచ్చమైన ఐడియాల ఫ్యాక్టరీ. కొవిడ్ సమయంలో ఎంతోమంది పిచ్చిపిచ్చి ఆలోచనలతో బుర్ర పాడుచేసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఆ తల్లీకూతుళ్లు మాత్రం.. కొత్త వ్యాపారం గురించి ఆలోచించారు. ఆ ఇద్దరి పేర్లు.. పూనమ్ రావల్, ఆకృతి రావల్. పూనమ్‌కు ముందు నుంచీ చేనేతలంటే ఇష్టం. ఆ ప్రత్యేక అభిరుచి ‘హౌస్ ఆఫ్ చికన్‌కారీ’ ఏర్పాటు వైపుగా అడుగులు వేయించింది. అదే సమయంలో చికన్‌కారీ వస్త్రకళను నమ్ముకున్న కళాకారులకు ఉపాధి కల్పించాలని కూడా సంకల్పించారు. ఆ శ్రమ వృథాగా పోలేదు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం ‘హౌస్ ఆఫ్ చికన్‌కారీ’ ఆరు వందల రెట్ల రాబడి సాధించింది.
ఆకృతి లండన్‌లో మేనేజ్మెంట్ కోర్సు చేసింది. ఆంత్రప్రెన్యూర్‌షిప్ అంటే ఆసక్తి. తల్లి అభిరుచినే బిజినెస్‌గా ఎంచుకున్నది. ఆ సంప్రదాయ కళకే కొంత ఆధునికతను జోడించింది. కొత్త డిజైన్లు పరిచయం చేసింది. ఆ ప్రయోగం విజయవంతమైంది. ఓ జాతీయ చానల్లో ప్రసారం అవుతున్న ‘షార్క్ ట్యాంక్’ కొత్త సిరీస్‌లో ‘హౌస్ ఆఫ్ చికన్‌కారీ’ సక్సెస్ స్టోరీ కూడా ప్రసారమైంది. దీంతో కొత్త పెట్టుబడులు వచ్చాయి. వెబ్‌సైట్‌కు ట్రాఫిక్ పెరిగింది. ‘మూడేండ్ల పరిమిత కాలంలోనే ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. వ్యాపారాన్ని మరింత బలంగా తీర్చిదిద్దడంపైనే దృష్టి పెడుతున్నాం. సిబ్బంది సంఖ్య పెంచే ఆలోచన ఉంది’ అంటారా తల్లీకూతుళ్లు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Business
- Chicken curry
- Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

