HomeLifestyleThere Is No Better Relaxation Technique Than A Bath
గలత్ బాత్
స్నానం ఓ కళ. శాస్త్రం కూడా. మూడు చెంబులతో ముగించడం ఎంత తప్పో, గంటలకొద్దీ షవర్ కింద కాలక్షేపం చేయడమూ అంతే తప్పు. చిన్నచిన్న పొరపాట్లను సరిచేసుకోగలిగితే. స్నానాన్ని మించిన రిలాక్సేషన్ టెక్నిక్ ఉండదు.
స్నానం ఓ కళ. శాస్త్రం కూడా. మూడు చెంబులతో ముగించడం ఎంత తప్పో, గంటలకొద్దీ షవర్ కింద కాలక్షేపం చేయడమూ అంతే తప్పు. చిన్నచిన్న పొరపాట్లను సరిచేసుకోగలిగితే. స్నానాన్ని మించిన రిలాక్సేషన్ టెక్నిక్ ఉండదు.
పది నిమిషాలకు మించి షవర్ కింద వద్దు. దీనివల్ల దీర్ఘకాలంలో వివిధ సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేడివేడి నీళ్లతో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుందన్నదీ అపోహే. దీనివల్ల చర్మం పొడిబారిపోవచ్చు. సహజ కాంతిని కోల్పోవచ్చు. స్నానానికి గోరువెచ్చని నీళ్లే ఉత్తమం.
ఎన్నిసార్లు సబ్బు రుబ్బితే చర్మం అంతగా శుభ్రపడుతుందన్నదీ అపోహే. దీనివల్ల సబ్బులోని రసాయనాల కారణంగా పీహెచ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఫలితంగా హానికర బ్యాక్టీరియాను ఎదిరించే సామర్థ్యం కోల్పోతుంది.
చాలామంది స్నానానికి ఉపయోగించే తువ్వాలును, ఒంటికి రుద్దుకునే పఫ్లనూ ఓ పట్టాన శుభ్రం చేసుకోరు. వాటిమీద ఫంగస్, బ్యాక్టీరియా చేరుకుంటాయి. చర్మ రోగాలకు కారణం అవుతాయి.
రోజూ తలస్నానం చేస్తే జుట్టు శుభ్రంగా ఉంటుందన్నదీ అబద్ధమే. దీనివల్ల కుదుళ్లపై ఒత్తిడి పడుతుంది. వారానికి మూడు రోజుల తలస్నానం సరిపోతుంది.
స్నానం కాగానే ఎండు తువ్వాలుతో బరబరా తుడిచేసుకోవడమూ సరికాదు. ముందుగా మెత్తని వస్త్రంతో ఒంటిని అద్దుకోవాలి.