Smartphone Addiction | యువతలో వ్యసనంలా మారిన స్మార్ట్‌ఫోన్.. అతి వాడకంతో వింత ప్రవర్తనలు.. మొబైల్ వాడొద్దంటే ఆత్మహత్యలు !
Smartphone Addiction | కుర్రాళ్లు, యువతులు మాట వినడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలు నిదుర పోతున్న సమయంలో వారి ఫోన్లను కన్నవారు తనిఖీ చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. చుట్టూ జరుగుతున్న సంఘటనలను తమ బిడ్డలకు ఆపాదించుకుని పేరెంట్స్ మనోవేదనకు గురవుతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు.
Smartphone Addiction | మా అమ్మాయి పూర్ణిమ(19) ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తున్నది. సెల్‌ఫోన్ వాడుతున్నప్పటి నుంచి మా మాట వినడం తగ్గించింది. మొండిగా సమాధానమిస్తున్నది. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావంటే చెప్పదు. గంటల కొద్దీ ఫోన్లోనే గడిపేస్తున్నది. మేమెప్పుడైనా ఊరెళ్తే ఇంట్లో ఒక్కతే ఉండాల్సి వస్తుందని మాతోనే వచ్చేది. ఇప్పుడు మేము ఎప్పుడు ఊరెళ్తామా అని ఎదురుచూస్తున్నట్టుగా ఆమె మాటలు ఉంటాయి. మా అమ్మాయికి ఎవరైనా ప్రేమికుడు ఉన్నారా? లేక ఆ వయసులో ఇలాంటి ప్రవర్తన సహజమేనా? రాత్రుల్లో కూడా సెల్‌ఫోన్ వినియోగిస్తుంటుంది. అసలు మా అమ్మాయి మొబైల్ నుంచి దూరం కావాలంటే ఏం చేయాలి?” అని ఓ తల్లి సైకియాట్రిస్టుకు వివరించింది.
మా పిల్లలు మార్కులు బాగా తెచ్చుకోవాలి.. ఉద్యోగాలు సంపాదించాలి. ఇలాంటి వాటిపైన తల్లిదండ్రులుగా శ్రద్ధ చూపి వారిని ఆ దిశగా ప్రోత్సాహం అందించాలి. కానీ మేము మా అబ్బాయిని సెల్‌ఫోన్ నుంచి దూరం చేయడానికే సమయం కేటాయించాల్సి వస్తున్నది. ఇక వాడిని చదువుకో అని చెప్పే ధైర్యం కూడా చేయలేకపోతున్నాం. కారణం వాడు మాపైనే చేతులెత్తుతున్నాడు. ఇంట్లో ఉన్న వస్తువులను విసిరేస్తున్నాడు. రాత్రి 2, 3 అయినా మేల్కొనే మొబైల్ ఏవో వీడియోలు చూస్తుంటాడు. ఓ రోజు వాడి ఫోన్ చెక్ చేస్తే అందులో అసభ్యకరమైన వీడియోలు ఉన్నాయి. వాడిని ఎలా మంచి ప్రవర్తనలోకి తీసుకురావాలి?” అంటూ హిమాయత్ నగర్‌కు చెందిన ప్రకాశ్ అనే తండ్రి సైకియాట్రిస్ట్‌ను ఆశ్రయించాడు.
సిటీబ్యూరో, మే 23 ( నమస్తే తెలంగాణ ) : కుర్రాళ్లు, యువతులు మాట వినడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలు నిదుర పోతున్న సమయంలో వారి ఫోన్లను కన్నవారు తనిఖీ చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. చుట్టూ జరుగుతున్న సంఘటనలను తమ బిడ్డలకు ఆపాదించుకుని పేరెంట్స్ మనోవేదనకు గురవుతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు. యువత భవిష్యత్తును నీలి నీడ నాశనం చేస్తున్నది. స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే నీలి కాంతులు ఒకవైపు.. అసభ్యకర వీడియోలు మరోవైపు వారి ఆలోచనలను మానసికంగా, శారీరకంగా భ్రష్టు పట్టిస్తున్నాయి. వారి ఉన్నత లక్ష్యాలు మధ్యలోనే ఆవిరవుతున్నాయి. గతంలో మార్కులు, ర్యాంకులు సాధించలేమని ఒత్తిడికి గురయ్యే యువత ఇప్పుడు క్షణకాలం ఫోన్లు ఆగినా, పెద్దలు ఆపేసినా గందరగోళానికి గురవుతున్నట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు. సెల్‌ఫోన్ వాడొద్దని షరతులు విధిస్తే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడటం లేదని తెలిపారు. ఇలాటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటేనే పిల్లల్లో మార్పు తీసుకురాగలమని సైకాలజిస్టులు సూచించారు.

ఎలా బయటపడాలి..?
ఎవరైనా అశ్లీల వీడియోలకు అడిక్ట్ అయి ఉంటే వారు మొదటగా ఆ విషయాన్ని తమలో తాము ఒప్పుకోవాలి. తమలో వచ్చిన మార్పులను గ్రహించాలి. రోజులో వారు ఎంత సమయం ఎటువంటి యాక్టివిటీస్‌కు వినియోగస్తున్నామో పేపర్‌పై రాసుకోవాలి. మనం చేయాల్సిన పనిని రద్దు చేసుకుని మరీ సెల్ఫోన్లోనే గడిపేస్తున్నామా? అనేది ఆలోచించాలి. ఇటువంటి ప్రవర్తనతో వచ్చే ప్రతికూల పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. స్వీయ నియంత్రణ అనేది చాలా ముఖ్యం. ఈ సమయంలో అడిక్షన్ నుంచి బయటపడటానికి మార్గాలు వెతుక్కోవాలి. చాలా వరకు ఒత్తిడితో ఉండే వాళ్లు, ఖాళీ సమయం ఎక్కువగా ఉన్నవాళ్లు ఆ సమయంలో ఇటువంటి విషయాల బారిపడుతుంటారు. ఎందుకంటే అన్నింటిలో కన్నా సెక్స్ అనేది చాలా సంతోషకరమైన ప్రక్రియ. ఇలాంటి పరిస్థితుల్లో మొబైల్ డేటా తగ్గించుకోవడం, అశ్లీల యాక్టివిటీ సదుపాయాలను రద్దు చేసుకోవడం చేయాలి. ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఖాళీ సమయాల్లో తమకు నచ్చిన ఇతర అభిరుచులు సంగీతం, డ్యాన్స్, ఇతరాత్ర పనులపై ఆలోచనలు సాగేలా దృష్టి కేంద్రీకరించాలి. ఇంకా కుదరని పక్షంలో సైకాలజిస్టును సంప్రదిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అప్రమత్తంగా ఉండాల్సిందే..
1 మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు, ఒంటరితనం, జీవితంపై నిరాశ ఇవన్నీ అలవాడేందుకు ఫోన్‌ను ఎక్కువగా వాడటమే కారణమంటున్నారు నిపుణులు. ఈ ధోరణిని అదుపు చేయకపోతే వ్యక్తిగత ఆరోగ్యం, సామాజిక భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి.
2 ప్రస్తుత విద్యావిధానంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా మారింది. దీంతో వారికి బ్రౌజింగ్ వ్యసనంగా మారింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే అది పిల్లల భవితకు శాపంగా మారే ప్రమాదముంది. పిల్లలతో కఠినంగా వ్యవహరించకుండా ఫ్రెండ్లీగా చెబితే వారిలో మార్పు ఉంటుంది.
3 సెల్‌ఫోన్ అదే పనిగా నియంత్రణ లేకుండా వినియోగించడం వల్ల నియంత్రణ కోల్పోయి ఒత్తిడికి గురవుతున్నారు. అవసరమైన విషయాలపై నిరాసక్తత ఉంటుంది. అతిగా ఆలోచించడం పెరుగుతుంది. మరోవైపు ఆరోగ్యపరంగాను క్యాన్సర్ వంటి వ్యాధులు పొంచి ఉన్నాయి.
4 పేరేంట్స్ కూడా అధికంగా మొబైల్ వినియోగించకుండా పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని నిపుణులు చెబుతున్నారు.
5 ప్రస్తుత ప్రపంచంలో నూటికి 90 శాతం మందికి ఏదో ఒక వ్యసనం కచ్చితంగా ఉంటుంది. అలా మన దేశంలో ప్రస్తుతం అశ్లీలత ఒకరకమైన మాదక ద్రవ్యం వంటి వ్యసనంగా మారిపోయింది. అశ్లీల వీడియోలు చూస్తున్న జాబితాలో చాలా మంది యువత అధికంగా ఉంటున్నారు. 17-24 ఏండ్ల మధ్య ఉన్న వారు 44 శాతం మంది, 25-34 మధ్య ఉన్న వారు 41 శాతం మంది అశ్లీల వీడియోలు చూస్తున్నట్టు ఓ సర్వే రిపోర్టు వెల్లడించింది. పిల్లలకు సృజనాత్మకత పెంపొందించేలా వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సాహం అందించాలి.
యువతతో సున్నితంగా వ్యవహరించాలి
యువత పెడదారి పట్టకుండా పేరెంట్స్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. టీనేజ్‌లో అడుగుపెట్టిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ వయసులో పిల్లలు స్వతంత్రులుగా వ్యవహరిస్తుంటారు. ప్రత్యేక గుర్తింపు కోసం వెంపర్లాడుతుంటారు. ఈ తరుణంలో వారు సెల్ఫోన్లను అధికంగా వినియోగిస్తారు. అందులో ఉండే అశ్లీలతకు తొందరగా అట్రాక్ట్ అవుతుంటారు. టీనేజ్‌లో పిల్లలకు తల్లిదండ్రులు అండగా నిలవాలి. వారి సమస్యలను ఓపికగా విని అర్థం చేసుకోవాలి. మాట నినడం లేదని కఠినంగా వ్యవహరించకూడదు.
– నందిత, సైకాలజిస్టు
లక్ష్యం వైపునకు ఆలోచనలు సాగాలి
ఏ వ్యసనం అయినా ఏదో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతోనే మొదలవుతుంది. ఆ తర్వాత అది అడిక్షన్‌గా మారుతుంది. అశ్లీల వీడియోల విషయంలోనూ ఇంతే. స్మార్ట్‌ఫోన్‌ను అతిగా వినియోగిస్తే నోమోఫోబియా వస్తుంది. వారంలో ఒక్క రోజు మొబైల్‌కు దూరంగా ఉండండి. మీలో ఈ ఫోబియో ఉందా లేదా తెలిసిపోతుంది. ఫోన్ వాడకుండా ఉండలేని భయం వెంటాడుతుంది. మొదడు ఖాళీగా ఉండకుండా ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, మన జీవింతలో పెట్టుకున్న గోల్స్ రిచయ్యే మార్గం కోసం కష్టపడటం లాంటి వాటిపైనే ఆలోచనలు సాగాలి.
– పాన్యం కవిత, సైకాలజిస్టు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

