Rainbow Jewellery | అతివలను మంత్రముగ్ధుల్ని చేస్తున్న రెయిన్ బో జువెలరీ..
Rainbow Jewellery | చిరుజల్లులు కురిసేవేళ.. హరివిల్లులు విరిసేవేళ..అందమంతా ఆమె కళ్లలోనే ఉందేమో అనిపించేంత ఆశ్చర్యం. తనకే సొంతమనుకున్న ఇంద్రధనుస్సు రంగులన్నిటినీ ఆకాశం ఆచ్ఛాదనగా వేసుకుందేమో అనుకునేంత సంభ్రమం.
Rainbow Jewellery | చిరుజల్లులు కురిసేవేళ.. హరివిల్లులు విరిసేవేళ..అందమంతా ఆమె కళ్లలోనే ఉందేమో అనిపించేంత ఆశ్చర్యం. తనకే సొంతమనుకున్న ఇంద్రధనుస్సు రంగులన్నిటినీ ఆకాశం ఆచ్ఛాదనగా వేసుకుందేమో అనుకునేంత సంభ్రమం. అందుకే హరివిల్లు నగజల్లులు ఆమెపై కురిసేలా ఎన్నో సోయగాలు ముస్తాబవుతున్నాయి. ‘రెయిన్ బో జువెలరీ’ చినుకు తడికి చిగురు తొడుగుతున్నది.
ఆకాశంలో అగుపించే సప్తవర్ణాలూ సంక్రాంతి ముగ్గును తలపిస్తాయి. సౌందర్యానికి సరిలేని చిరునామాగా అనిపిస్తాయి. వృత్తలేఖినితో గీయకపోయినా ఆ కోణంలో అణువంత కూడా అపభ్రంశం ఉండదు. ఒక్కో ప్రఖ్యాత చిత్రకారుడూ తన ప్రతిభను చూపుతూ గీసినట్టు ప్రతిసారీ ఆ రంగుల మేళవింపులో వినూత్నతే. అందుకే ఆ అందం ఆభరణానికి అచ్చమైన జోడీ అయింది. హరివిల్లు నగలు అతివకు చేరువయ్యాయి. ఇంద్రధనుస్సు ఆభరణాలు మగువ హృదిని మృదువుగా ముద్దాడాయి.

ఆమె కోసం మలిచే ఆ సొమ్ముల్లో చెవి లోలాకులు, చేతి గొలుసులు చక్కనైన వన్నెల్లో, మరెన్నో నగిషీల్లో మెరిసిపోతున్నాయి. మెడలో నగగా వేలాడే ఇంద్రధనుస్సుకు ఎనామిల్ సోకులూ, రాళ్ల సొంపులూ తోడవుతున్నాయి. అందమైన హస్తాలకు అంగుళీకమైన హరివిల్లు కొండను అద్దంలో చూసిన అనుభూతిని కలిగిస్తుంది. పచ్చ బంగారమైనా, కాకి బంగారంతో తయారైనా కాంతకు కాంతులద్దడమే ఈ విల్లు విరిసిన బాణపు లక్ష్యం. అది చేరిందీ లేనిదీ అలంకరించుకుంటేనే అర్థమవుతుంది మరి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

