హాయ్.. ఏఐ!
ఈ రోజుల్లో ఏఐ టూల్స్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ లాంటి టూల్స్‌ను కేవలం సమాచారం తెలుసుకునేందుకు మాత్రమే ఉపయోగించడం లేదు. చాలామంది వ్యక్తిగత విషయాలను సైతం ఏఐతో పంచుకుంటున్నారు. డేటింగ్ విషయంలోనూ కృత్రిమమేధ వాడకం పెరిగిపోయింది.
ఈ రోజుల్లో ఏఐ టూల్స్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ లాంటి టూల్స్‌ను కేవలం సమాచారం తెలుసుకునేందుకు మాత్రమే ఉపయోగించడం లేదు. చాలామంది వ్యక్తిగత విషయాలను సైతం ఏఐతో పంచుకుంటున్నారు. డేటింగ్ విషయంలోనూ కృత్రిమమేధ వాడకం పెరిగిపోయింది. ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడానికి ఏఐని తెగ ఉపయోగిస్తున్నట్టు ఓ కొత్త అధ్యయనంలో వెల్లడైంది. డేటింగ్ యాప్ గ్లీడెన్, రీసెర్చ్ సంస్థ ఇప్సోస్ కలిసి 1,500 మంది భారతీయులపై నిర్వహించిన ఒక సరికొత్త సర్వేలో ఒక షాకింగ్ విషయం బయటపడింది.
ఈ సర్వే ప్రకారం దాదాపు 61 శాతం మంది భారతీయులు తమ భాగస్వాములతో చాటింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఏఐ సాయం తీసుకుంటున్నారట. బోరింగ్‌గా ఉన్న ప్రొఫైల్ బయోను అందంగా మార్చాలన్నా, అవతలి వారు అడిగిన ప్రశ్నకు క్రేజీ రిైప్లె ఇవ్వాలన్నా.. ‘ఏఐవింగ్ మ్యాన్’ ఒక అలవాటుగా మారింది. 63 శాతం మంది తమ ప్రేమ వ్యవహారాల్లో సలహాలు, సూచనల కోసం ఏఐని ఒక రోబోటిక్ కోచ్‌గా వాడుతున్నారు. 66 శాతం మంది తమ డేటింగ్ ప్రొఫైల్స్ లేదా సోషల్ మీడియా బయోలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ఏఐపై ఆధారపడుతున్నారు.
61 శాతం మంది అవతలి వ్యక్తి చాట్ చేస్తున్న సమయంలోనే స్మార్ట్ రిైప్లె ఇవ్వడానికి ఏఐని వాడుతున్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. కృత్రిమమేధ మన డేటింగ్ ప్రొఫైల్‌ను అద్భుతంగా మార్చగలిగినా మన జీవితాల్లో సంతోషాన్ని మాత్రం నింపలేదన్నది వాస్తవం. 92 శాతం మంది తాము పార్ట్‌నర్స్‌తో హ్యాపీగానే ఉన్నామని చెబుతున్నప్పటికీ, అందులో 57 శాతం మంది కొన్ని సమయాల్లో తాము ఒంటరిగా ఫీలవుతున్నట్టు అంగీకరించారు. దాంతో పాటు 69 శాతం మంది భారతీయులు తాము ఏఐతో చేసిన చాట్ హిస్టరీని ఇతరులు చూస్తే చాలా అసౌకర్యంగా ఫీలవుతామని చెప్పారు.
దీనర్థం ఏంటంటే.. తాము ఏఐతో పంచుకున్న సందేహాలు, భయాలు, రీ-చెక్ చేసుకున్న విషయాలు చాలా వ్యక్తిగతమైనవని వారికి తెలుసు. ‘భారతీయ యువతలో కమ్యూనికేషన్ సిల్స్, ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలనే తాపత్రయం ఎకువ. అవతలి వ్యక్తి ముందు తక్కువ కాకూడదనే ఉద్దేశంతో గ్రామర్ తప్పులు లేకుండా, ఇంగ్లిష్ పదజాలం అద్భుతంగా వాడటం కోసం చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఎకువగా వాడుతున్నార’ని సర్వేకారుల అభిప్రాయం. విదేశాలతో పోలిస్తే భారతదేశంలో సంబంధాలు, పెళ్లి విషయంలో కుటుంబాల ఒత్తిడి, సామాజిక భయాలు ఎకువ. అందుకే భాగస్వామిని ఎంచుకునే క్రమంలో ఏ తప్పూ జరగకూడదని ఏఐపై ఎకువగా ఆధారపడుతున్నారని కూడా వాళ్లు చెబుతున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

