ఆలస్యమైనా.. అందలం మనకే!
తాప్సీ.. పరిశ్రమలో నిలదొక్కుకోడానికి గ్లామర్ డాల్ పాత్రలకు సిద్ధపడినా.. తానేమిటో నిరూపించు కున్నాక మనసుకు నచ్చిన కథనాలనే ఎంచుకుంటున్నది. మహిళ జీవితం చుట్టూ తిరిగే సినిమాలకే ఓకే చెబుతున్నది. తన అనుభవాలను పాఠాలుగా మార్చి తోటి మహిళలకు వికాస సూత్రాలు బోధిస్తున్నది.
తాప్సీ.. పరిశ్రమలో నిలదొక్కుకోడానికి గ్లామర్ డాల్ పాత్రలకు సిద్ధపడినా.. తానేమిటో నిరూపించు కున్నాక మనసుకు నచ్చిన కథనాలనే ఎంచుకుంటున్నది. మహిళ జీవితం చుట్టూ తిరిగే సినిమాలకే ఓకే చెబుతున్నది. తన అనుభవాలను పాఠాలుగా మార్చి తోటి మహిళలకు వికాస సూత్రాలు బోధిస్తున్నది.
పెండ్లికి ముందు ఆర్థిక స్వాతంత్య్రం చాలా అవసరం. చాలామంది అమ్మాయిలు అత్తింట్లో కష్టాలు మొదలైన తర్వాతో, భర్త అసమర్థుడని తేలాకో, లేదంటే తీరా విడాకులు తీసుకున్నాకో ఆర్థిక స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు. అది సరికాదు.
పారితోషికం విషయంలో మహిళలు ఎప్పుడూ ఓ అడుగు వెనకే ఉంటారు. తమను తాము ప్రమోట్ చేసుకోవడం, తమకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకోవడం వాళ్లకు తెలియదు. సమాజంలోని చిన్నచూపు కూడా ఆర్థిక వివక్షకు ఓ కారణమే! మా నిర్మాణ సంస్థలో అత్యధిక మొత్తాన్ని పారితోషికంగా తీసుకునేది మహిళలే.
మన జీవితం మీద మనకు నియంత్రణ ఉండాలి. భర్త పెత్తనమో, నాన్న మార్గదర్శనమో ఓ దశ వరకే! మన జీవితానికి మనం తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, భారతీయ మహిళ చిట్టచివరి స్థానం తనకు ఇచ్చుకుంటుంది.
పొదుపు మంచిదే. కానీ జీవితాన్ని ఆస్వాదించాల్సి వచ్చినప్పుడు లెక్కలు చూసుకోకూడదు. తగిన స్తోమత ఉన్నప్పుడు.. బడ్జెట్ పెట్టుకుని షాపింగ్ చేయడం, ధరలు చూసి ఫుడ్ ఆర్డర్ చేయడం పిసినారితనమే అవుతుంది. భారతీయ మహిళ సంపాదించడమే కాదు, ఆనందించడమూ నేర్చుకోవాలి. డబ్బు ఎలా వస్తున్నది, ఎక్కడికి వెళ్తున్నది.. గమనిస్తూ ఉంటే చాలు.
వ్యాపారం.. మహిళలకు ప్రవేశం లేని రంగమేం కాదు. ఆమాటకొస్తే పురుషులతో పోలిస్తే స్త్రీలే మంచి వ్యాపారవేత్తలు అనిపించుకుంటారు. తొలిరోజుల్లో నాకూ కొన్ని భయాలు, అపోహలు ఉండేవి. ఇప్పుడు, పక్కా బిజినెస్
ఉమెన్‌గా మారుతున్నా. ‘వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ పేరుతో డిజైనర్ స్టోర్ నడుపుతున్నా. ఓ బ్యాడ్మింటన్ ఫ్రాంచైజీ కూడా ఉంది. వ్యాపారం నా ప్లాన్ బీ కూడా.
ఎన్ని అవరోధాలు ఎదురైనా హక్కుల కోసం మహిళ పోరాడుతూనే ఉండాలి. మన జీవితకాలంలో సంపూర్ణ విజయం సాధ్యం కాకపోవచ్చు. కానీ, రాబోయే తరాలు మాత్రం ఆ ఫలితాలను ఆస్వాదిస్తాయి.
సేఫ్‌జోన్.. ఓ భ్రమ మాత్రమే. ఆ ఊహారేఖను దాటి బయటికి రావాలి. సవాళ్లను అధిగమించాలి. గ్లామర్ స్టార్ అనే సేఫ్‌జోన్ నుంచి బయటపడటం వల్లే.. బాలీవుడ్లో నాకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాను. మీరు ఎంచుకున్న రంగం ఏదైనా కానివ్వండి.. ఎదగాలనే ఆకాంక్షను మాత్రం వదులుకోకండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

