ఫ్రిజ్‌పై స్మార్ట్ కన్ను!
ఈరోజుల్లో ఇంట్లో ప్రతివస్తువూ స్మార్ట్‌గానే పనిచేస్తున్నది. ఇంటి తాళం దగ్గరనుంచి బాత్రూమ్ ఫ్లష్ వరకు అన్నిటినీ స్మార్ట్‌గా ఆపరేట్ చేసేయొచ్చు. ఆటోమాటిక్ సెన్సర్లు స్మార్ట్ పరికరాల పనితీరుని మరింత సులభతరంం చేస్తున్నాయి. తాజాగా కిచెన్‌కి ఉపయోగపడే మరో స్మార్ట్ పరికరం మార్కెట్లోకి వచ్చేసింది.
ఈరోజుల్లో ఇంట్లో ప్రతివస్తువూ స్మార్ట్‌గానే పనిచేస్తున్నది. ఇంటి తాళం దగ్గరనుంచి బాత్రూమ్ ఫ్లష్ వరకు అన్నిటినీ స్మార్ట్‌గా ఆపరేట్ చేసేయొచ్చు. ఆటోమాటిక్ సెన్సర్లు స్మార్ట్ పరికరాల పనితీరుని మరింత సులభతరంం చేస్తున్నాయి. తాజాగా కిచెన్‌కి ఉపయోగపడే మరో స్మార్ట్ పరికరం మార్కెట్లోకి వచ్చేసింది. అదే ఫ్రిడ్జ్ కెమెరా. ఫ్రిడ్జ్‌లో కెమెరా ఎందుకు అనుకుంటున్నారా? దీని ఉపయోగం తెలుసుకుంటే మాత్రం మీ ఆలోచన వెంటనే మారిపోతుంది. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందంటే..
ఇంట్లో వాడే అన్ని పరికరాల మాదిరిగానే ఫ్రిడ్జ్ పరిమాణం కూడా పెరిగిపోయింది. అవసరాన్ని బట్టి కొంతమంది ఏకంగా వెయ్యి లీటర్ల రిఫ్రిజిరేటర్లను వాడుతున్నారు. అంతపెద్ద కోల్డ్ స్టోరేజీలో ఏయే పదార్థాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అంతేకాదు, సాధారణంగా షాపింగ్ చేసినప్పుడు, నిత్యావసరాలు కొన్నప్పుడు అవసరానికి మించి కొంటూ ఉంటారు. అయితే వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి మర్చిపోతాం! కొన్నాళ్లకు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చూసి అయ్యో అనుకుంటాం. కానీ ఈ కెమెరాని ఫ్రిడ్జ్ డోర్‌కి పెట్టేస్తే చాలు ఎప్పటికప్పుడు ఆహారపదార్థాల ఎక్స్పైరీ డేట్స్ తనిఖీ చేసుకునే శ్రమ తప్పుతుంది.
ఎలాగంటే.. ఈ కెమెరాని ఫోన్‌కి కనెక్ట్ చేసుకుని, ఫ్రిడ్జ్‌లో పెట్టే ముందే ఆహారపదార్థాల బార్‌కోడ్‌ని కెమెరా ముందు పెడితే అది స్కాన్ చేసి ఆయా పదార్థాల వివరాలు, ఎక్స్పైరీ తేదీలను నమోదు చేసుకుంటుంది. ఎక్స్పైరీ డేట్ దగ్గరపడుతుంటే ఫోన్‌కి అలర్ట్ మెసేజ్‌లు పంపుతుంది. అంతేకాదు ఇంట్లో పెద్దవాళ్లు లేనప్పుడు పిల్లలు ఫ్రిడ్జ్ డోర్ తీసినా వెంటనే ఫోన్‌కి అలర్ట్ వస్తుంది. USB ద్వారా ఈ కెమెరాని సులువుగా చార్జ్ చేయొచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో కనెక్ట్ చేసి వాయిస్‌తోనూ దీనిని కంట్రోల్ చేయవచ్చు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

