ఐబ్రోస్ అందంగా
మందపాటి కనుబొమలు ఉంటే మనకు నచ్చిన షేప్ చేయించుకోవచ్చు. జుట్టుతో పాటు కనుబొమలు కూడా పల్చబడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ముఖానికి అనుకున్న అందం రాదు. అందుకే వాటికోసం ప్రత్యేక సంరక్షణ అవసరం.
మందపాటి కనుబొమలు ఉంటే మనకు నచ్చిన షేప్ చేయించుకోవచ్చు. జుట్టుతో పాటు కనుబొమలు కూడా పల్చబడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ముఖానికి అనుకున్న అందం రాదు. అందుకే వాటికోసం ప్రత్యేక సంరక్షణ అవసరం.
- కోల్డ్‌ప్రెస్డ్ ఆముదాన్ని చిన్న బ్రష్ లేదా కాటన్ స్వాబ్‌తో అద్ది కనుబొమల మీద సమంగా రాసి రాత్రంతా వదిలేయాలి. అందులో ఉండే రిసినోలిక్ ఆసిడ్ కనుబొమల వెంట్రుకల కుదుళ్లను కండిషనింగ్ చేస్తుంది.
- గోరువెచ్చగా చేసిన ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెను కనుబొమలమీద వేసి మృదువుగా మర్దనా చేయాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల రక్త సరఫరా మెరుగుపడి, ఆ ప్రాంతానికి తగినంత ప్రొటీన్ అందుతుంది.
- మార్కెట్లో కనుబొమల కోసమే ప్రత్యేకంగా సీరంలు దొరుకుతున్నాయి. అందులో పప్టైడ్, బయోటిన్, కెరాటిన్ లాంటివి ఉంటాయి. ఇవి కుదుళ్ల మీద పనిచేసి వెంట్రుకలు పెరిగేందుకు సాయపడతాయి.
- ఐరన్, జింక్, బయాటిన్లతో పాటు విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రొటీన్ కూడా జుట్టు పెరుగుదలకు అత్యంత ప్రధానం. తగినంత నిద్ర పోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ప్రధానంగా పనిచేసే అంశాలు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

