వెండిలో పోల్కీ సొగసు
పోల్కీ ధగధగలు ఇన్నాళ్లూ సెలెబ్రిటీల దగ్గరే చూశాం. ప్యూర్ సిల్వర్ నగల పుణ్యమాని ఇప్పుడవి సామాన్యులకూ చేరువ అవుతున్నాయి. ఈ ప్రత్యేకమైన వజ్రాన్ని వెండి నగల్లో పొదగడం నయా ట్రెండ్.
పోల్కీ ధగధగలు ఇన్నాళ్లూ సెలెబ్రిటీల దగ్గరే చూశాం. ప్యూర్ సిల్వర్ నగల పుణ్యమాని ఇప్పుడవి సామాన్యులకూ
చేరువ అవుతున్నాయి. ఈ ప్రత్యేకమైన వజ్రాన్ని వెండి నగల్లో పొదగడం నయా ట్రెండ్.
ఏ సెలెబ్రిటీ ఈవెంట్ జరిగినా పెద్దపెద్ద రాళ్లు పొదిగిన నెక్లెస్‌లు ఫొటోల్లో తళుక్కుమని మెరుస్తాయి. తెల్లగా వెలిగిపోతూ చూపరులను కట్టి పడేస్తాయి. సాధారణంగా నగిషీ చెక్కని వజ్రాన్ని ‘పోల్కీ’ అని పిలుస్తారు. వీటిని కూడా గనుల నుంచే తీస్తారు. ఈమధ్య, ల్యాబ్స్‌లో కూడా తయారు చేస్తున్నారు. కాంతి పరావర్తనం చెందినప్పుడు ఇవి వజ్రాల కన్నా ఎక్కువగా
తళుకులీనుతాయి.
ఆ అందాన్ని చూసే కాదు, పర్యావరణం మీద ప్రేమతోనూ చాలా మంది వీటిని ఇష్టపడుతున్నారు. అచ్చం బంగారు నగల్లా వెండి ఆభరణాల్ని రూపొందించడం సరికొత్త ట్రెండ్‌గా మారింది. దీంతో పోల్కీలనూ వెండిలో జొప్పించే ప్రయత్నం చేసి, సక్సెస్ సాధించారు డిజైనర్లు. ఇంకేం, సెలెబ్రిటీలు పెట్టుకునే నగలన్నీ తక్కువ ధరలోనే సామాన్యులకూ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.
నెక్లెస్‌లు, చోకర్లు, హారాలతో పాటు ఉంగరాలు, దుద్దులు, గాజుల్లాంటివీ వెండి పోల్కీ నగల్లో ముస్తాబవుతున్నాయి. రాళ్లు అవే కావడంతో నగధగలు ఏమాత్రం తగ్గే అవకాశం లేదు. అన్నట్టు, ఆభరణాల తయారీ సంస్థలు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. సగం రేటుకి తిరిగి కొంటామని హామీ ఇస్తున్నాయి. ఇంకేం, కొన్నాళ్లు పెట్టుకున్నాక డిజైన్ మార్చేసుకోవచ్చు. ఇన్ని మంచి సంగతులు తెలిశాక కూడా గమ్మునుంటామా? మనం మాత్రం సెలెబ్రిటీ లుక్ కోసం ఎందుకు ట్రై చేయకూడదు?!

Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

