షేక్ చేస్తే.. సేఫ్టీ
అభివృద్ధి పరుగులు పెడుతున్నా.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో ఏదో ఒకచోట వారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.
అభివృద్ధి పరుగులు పెడుతున్నా.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా.. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో ఏదో ఒకచోట వారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీని వాడుకుని మహిళలను సురక్షితంగా ఉంచేందుకు పలు కంపెనీలు రకరకాల యాప్లను అభివృద్ధి చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు, స్నేహితులు, ఆత్మీయులు, తల్లిదండ్రుల సాయం కోరేందుకు, వారు ఉన్న ప్రదేశాన్ని ట్రేస్ చేసేందుకు సాయపడేలా వీటిని రూపొందిస్తున్నాయి.
అందులో భాగంగా రూపొందించినదే షేక్2సేఫ్టీ. కొన్ని అత్యవసర సమయాల్లో నంబర్ టైప్ చేసే పరిస్థితి ఉండదు. కాల్లిస్ట్ వెతికే అవకాశం కూడా దొరకదు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది షేక్2సేఫ్టీ. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ షేక్ చేసినా, పవర్ బటన్ను నాలుగుసార్లు క్లిక్ చేసినా యాప్లో ఎంపిక చేసుకున్న నంబర్లకు అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. మీరున్న పరిస్థితికి సంబంధించిన ఆడియో కూడా ఎమర్జెన్సీ నంబర్లకు చేరుతుంది. ఎస్ఓఎస్ మెసేజ్ పంపడానికి సైరన్ బటన్ కూడా జతచేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

