సెప్టెంబర్ చెప్పులు!
సెప్టెంబర్ పూల గురించి వినే ఉంటారు. ‘సెప్టెంబర్ షూస్' మాత్రం మనకు కొత్తే. నిష్కా అగర్వాల్ ఆలోచన ఇది. వేలకు వేలు పోసి.. ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకమైన డ్రెస్‌లు కొంటాం. కానీ, మ్యాచింగ్ పాదరక్షలు, బ్యాగు సంగతి మరిచిపోతాం.
సెప్టెంబర్ పూల గురించి వినే ఉంటారు. ‘సెప్టెంబర్ షూస్’ మాత్రం మనకు కొత్తే. నిష్కా అగర్వాల్ ఆలోచన ఇది. వేలకు వేలు పోసి.. ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకమైన డ్రెస్‌లు కొంటాం. కానీ, మ్యాచింగ్ పాదరక్షలు, బ్యాగు సంగతి మరిచిపోతాం. చివరి క్షణంలో ఏదో ఒకటి ఎంచుకుంటాం. ‘ఇంత రాజీ అవసరమా?’ అనిపించింది నిష్కా అగర్వాల్‌కు. తాను పుట్టిన నెల అయిన సెప్టెంబరును తన స్టార్టప్ పేరులో భాగం చేసుకుంది. పాదరక్షల సైజు, రంగు, ఎంబ్రాయిడరీ, డిజైన్.. మనమే ఎంచుకోవచ్చు.
తయారీలో వీగన్ లెదర్ వాడటం ఆమె ప్రత్యేకత. అన్నట్టు, నిష్కా మంచి డ్యాన్సర్ కూడా. డ్యాన్స్‌ఫ్లోర్ మీద ధరించడానికి అనువైన పాదరక్షలు మన దగ్గర లభించవు. వాటిని కూడా తయారుచేస్తుంది ‘సెప్టెంబర్ షూస్’. ఆర్డర్ ఇచ్చిన మూడు నుంచి ఏడు రోజులలో మన ఇంటికి పంపుతారు. హైదరాబాద్‌లోని మసాబ్ ట్యాంక్‌లో ఓ ఆఫ్ లైన్ స్టోర్‌ను కూడా ప్రారంభించింది నిష్కా. ‘నెలకు నాలుగువందల వరకూ కస్టమైజ్డ్ షూస్ తయారు చేస్తున్నాం. బ్రైడల్ ఫుట్‌వేర్ మా ప్రత్యేకత. మోడల్‌ను బట్టి రెండున్నర వేల నుంచి ఏడున్నర వేల వరకూ ధరలు ఉంటాయి’ అని వివరిస్తారు నిష్కా అగర్వాల్.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

