మాది పెద్దలు కుదిర్చిన పెండ్లి.. రోజూ తిట్టుకుంటాం.. మా మధ్య ప్రేమ లేదా?
మాది పెద్దలు కుదిర్చిన పెండ్లి. నా వయసు ముప్పై రెండు. ఆయనకు ముప్పై అయిదు. చాలా అన్యోన్యంగా ఉంటాం. కానీ, మా అభిప్రాయాలు మాత్రం ఒకేలా ఉండవు. తనకు నచ్చింది నాకు నచ్చదు. నేను బావుందని చెప్పినప్పుడు, అతను అస్సలు బాలేదని విభేదిస్తాడు. ఒక్కోసారి తీవ్రంగా వాదించుకుంటాం కూడా. ఎందుకిలా జరుగుతున్నది? మా మధ్య ప్రేమ లేదా?

– ఓ పాఠకురాలు
అలా ఎందుకు అనుకుంటారు? ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి ఇష్టాలు వారివి. భిన్నాభిప్రాయాలు సహజం. భేదాభిప్రాయాలు సాధారణం. మనకు నచ్చని విషయాలను మనసులోనే మురగబెట్టుకోవడం కంటే.. చర్చించుకోవడం, వాదించుకోవడమే మేలు. దీనివల్ల అనవసరమైన బరువు దిగిపోతుంది. కానీ, ఆ వాదన వితండం కాకూడదు. ఒకరి మీద ఒకరికి బలమైన ప్రేమ, నమ్మకం ఉన్నంతకాలం మీ బంధానికొచ్చిన ఇబ్బందేం లేదు. అదే సమయంలో ఎదుటి మనిషి ఆలోచనలను ఆమోదించినా, ఆమోదించకపోయినా గౌరవించడం మాత్రం నేర్చుకోండి.
తన అభిరుచులను, ఆసక్తులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇద్దరూ ఆమోదించే అంశాలూ కొన్ని ఉంటాయి. ఉదాహరణకు మీ ఇద్దరికీ మంచి భోజనం ఇష్టమైతే.. వారాంతాల్లో ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లండి. సినిమాలు ఇష్టమైతే.. తరచూ కలిసి చూడండి. దీనివల్ల దగ్గరితనం పెరుగుతుంది. అంతేకానీ, విభేదించే విషయాలనే పట్టుకుని వేలాడకండి. చర్చ వివాదాల స్థాయికి చేరుకుంటున్నట్టు అనుమానం రాగానే.. ముక్తాయింపు పలకండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి