పెరుగుదల.. ఎందుకిలా?
పిల్లల ఎత్తు గురించి తల్లిదండ్రులకు అనేక అపోహలు, అనుమానాలు ఉంటాయి. ఏవో భయాలు వెంటాడుతుంటాయి. ఒకే వయసు పిల్లల్లో కొందరు పొడవుగా, కొందరు పొట్టిగా ఉండటానికి డీఎన్ఏ, పోషకాహార లోపం, అనారోగ్యాలు.. ఇలా అనేకానేక కారణాలు.
పిల్లల ఎత్తు గురించి తల్లిదండ్రులకు అనేక అపోహలు, అనుమానాలు ఉంటాయి. ఏవో భయాలు వెంటాడుతుంటాయి. ఒకే వయసు పిల్లల్లో కొందరు పొడవుగా, కొందరు పొట్టిగా ఉండటానికి డీఎన్ఏ, పోషకాహార లోపం, అనారోగ్యాలు.. ఇలా అనేకానేక కారణాలు.
అపోహ: యుక్తవయసు తర్వాత పిల్లలు ఎత్తు పెరగడం అసాధ్యం.
వాస్తవం : యుక్తవయసుకు వచ్చే ముందు చాలామంది పిల్లలు రెండు అంగుళాలు పెరుగుతారు. యుక్తవయసు రాగానే పెరుగుదల కొంత వేగవంతం
అవుతుంది. అంతేకానీ, యుక్తవయసుతోనే ఆగిపోదు. కొన్నిసార్లు 18-19 ఏండ్లు వచ్చే వరకూ పెరుగుతూనే ఉంటారు. ఇది వివిధ కారణాలపై ఆధారపడి ఉంది.
అపోహ : పిల్లల ఎత్తును డీఎన్ఏ మాత్రమే నిర్ణయించగలదు.
వాస్తవం : పిల్లల పెరుగుదలలో డీఎన్ఏ పాత్ర 70 నుంచి 80 శాతం వరకూ ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం, తగిన నిద్ర, వ్యాయామం కూడా పెరుగుదలకు దోహదపడతాయి. ఊబకాయం, పోషకాల కొరత.. ఈ రెండూ పిల్లల ఎత్తుకు మోకాలడ్డుతాయి. తీసుకెళ్లి పొట్టివాళ్ల ఖాతాలో పడేస్తాయి.
అపోహ : పాలు తాగడం వల్ల పిల్లలు పొడవు అవుతారు.
వాస్తవం : పిల్లల ఎత్తు ఎముక పొడవుపై ఆధారపడి ఉంటుంది. ఎముకలు సరిగా పెరిగేందుకు అవసరమైన విటమిన్-డి, క్యాల్షియం పుష్కలంగా ఉంటేనే అది సాధ్యం. అయితే, చాలామంది తల్లిదండ్రులు పాల ద్వారా మాత్రమే క్యాల్షియం లభిస్తుందని భ్రమపడుతుంటారు. బచ్చలికూర వంటి ఆకుకూరల్లో క్యాల్షియం, ఉదయపు ఎండలో విటమిన్-డి సమృద్ధిగా ఉంటాయి.
ముగింపు : తల్లిదండ్రులు ఇప్పటికైనా అపోహలు వీడాలి. పిల్లల జీవనశైలిలో తగినంత నిద్ర, పోషకాహారంతో కూడిన భోజనం, వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. కాబోయే తల్లులు గర్భస్థ దశలోనే సరైన పోషకాలు తీసుకోవాలి. పిల్లల్ని స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉంచాలి. ఆటపాటలు అలవాటు చేయాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- childrens height
- height
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

