Hair | ఈ క్లిప్స్‌తో చిటికెలో మీకు నచ్చిన రకంగా జడ వేసుకోండి!
Hair | జడ వేసుకోవడం వచ్చినా రాకపోయినా.. హెయిర్ ైస్టెల్ మాత్రం ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటారు చాలామంది. ఇష్టం కదా అని రకరకాల జడలు చిటికెలో వేసుకోవడం రావాలంటే కష్టమే. అందుకే అనుకున్నదే తడవుగా ఎవరి జడను వాళ్లే సరికొత్తగా అల్లుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ‘క్లోవర్ డక్‌బిల్ క్లిప్స్'.
Hair | జడ వేసుకోవడం వచ్చినా రాకపోయినా.. హెయిర్ స్టైల్ మాత్రం ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటారు చాలామంది. ఇష్టం కదా అని రకరకాల జడలు చిటికెలో వేసుకోవడం రావాలంటే కష్టమే. అందుకే అనుకున్నదే తడవుగా ఎవరి జడను వాళ్లే సరికొత్తగా అల్లుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ‘క్లోవర్ డక్‌బిల్ క్లిప్స్’. ఒక పొడవైన క్లిప్‌లో మూడు, నాలుగు చిన్న క్లిప్పులు ఉంటాయి. పెద్ద క్లిప్పును జుట్టుకు పెట్టాక, పైన పాయలను తీసి మెలివేసి ఈ చిన్న క్లిప్పులలో పెట్టవచ్చు. జుట్టు ముందు భాగంలో ఈ తరహా క్లిప్‌తో ఓ పక్కగా జడ వేసుకుంటే, మరో క్లిప్ అందంగా కనిపించడంతో పాటు అందులోని పాయలు వెరైటీగా అనిపిస్తాయి.
కొత్త రకం జడను తలపిస్తాయి. ఈ జడపిన్నును వెనకవైపు పెడితే ఫ్రెంచ్ ప్లెయిట్ తరహాలో జడ అల్లుకోవచ్చు. అలాగే చిన్న చిన్న జడలు అల్లి ఈ చిన్న క్లిప్పుల్లో అమర్చినా వెరైటీ తలకట్టు ఆవిష్కృతం అవుతుంది. ఇదే తరహాలో హెయిర్ బ్యాండ్లూ తయారవుతున్నాయి. అంటే సాధారణ హెయిర్ బ్యాండ్లాగే దీన్నీ పెట్టుకోవచ్చు. బ్యాండ్ పైన చుట్టూ చిన్న చిన్న క్లిప్పులు ఉంటాయి. ఈ ‘క్లిప్ హెయిర్ బ్యాండ్’ లోపల వెంట్రుకలను పాయలు చేసి పెడితే విభిన్నమైన లుక్ మన సొంతం అవుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

