స్టైలిష్‌గా కనిపించాలనే అందరూ కోరుకుంటారు. లావుగా ఉన్న వారితో పోలిస్తే సన్నగా ఉన్న వాళ్లకు ఏ రకమైన దుస్తులైనా బాగా నప్పుతాయని అనుకుంటారు. అయితే, సరైన మోడల్స్‌ను ఎంపిక చేసుకుంటే లావుగా ఉన్న వాళ్లు కూడా స్టైలిష్‌గా కనిపించవచ్చు. కాబట్టి, లావుగా ఉన్నవాళ్లు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి.. ఎలాంటి మోడల్స్‌కు దూరంగా ఉండాలో చూద్దాం..
లో వెయిస్ట్ జీన్స్ వేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే, ఈ జీన్స్ వేసుకుంటే కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. లావుగా ఉన్నవారు పొట్టని కవర్ చేసుకునేందుకు నార్మల్ జీన్స్ వేసుకోవాలి.
లావుగా ఉండేవాళ్లు బిగుతుగా ఉండే టీషర్ట్లు, దుస్తులు ధరించకూడదు. వాటి వల్ల మరింత లావుగా కనిపిస్తారు. సైజ్‌కు తగినవి కాకుండా.. కాస్త వదులుగా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల సాధారణం కన్నా సన్నగా కనిపిస్తారు.
ఎక్కువ బట్టలు వేసుకుంటే లావుగా కనిపిస్తామని అనుకుంటారు. కానీ, సింగిల్ లేయర్ దుస్తులు వేసుకున్నప్పుడు శరీర భాగాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు డబుల్ లేయర్ ఉన్న దుస్తులని ఎంచుకుంటే, చక్కగా కవర్ చేసినట్టు అవుతుంది.