గోళ్లు మనం పట్టించుకోకున్నా పెరిగిపోతాయి. అలాగని అలుసుగా చూడటానికి లేదు. అవి అందంగా ఉంటేనే ఆకర్షణ. చేతి వేళ్లకున్న మకుటాల్లాంటి గోళ్లు మరింత మనోహరంగా మెరిసిపోవాలంటే ఈ సూచనలు ఫాలో అవ్వండి..
గోళ్లు మనం పట్టించుకోకున్నా పెరిగిపోతాయి. అలాగని అలుసుగా చూడటానికి లేదు. అవి అందంగా ఉంటేనే ఆకర్షణ. చేతి వేళ్లకున్న మకుటాల్లాంటి గోళ్లు మరింత మనోహరంగా మెరిసిపోవాలంటే ఈ సూచనలు ఫాలో అవ్వండి..
విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు… ఇలా అన్ని పోషకాలూ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే గోళ్లు కూడా దృఢంగా ఉంటాయి.
నీరు తగినంత తాగుతూ ఉంటే, గోళ్లు పెళుసుబారకుండా, పొరలుపొరలుగా ఊడిపోకుండా ఉంటాయి.
అంట్లు తోమేందుకు, బాత్రూంలు కడిగేందుకు వాడే సబ్బులు, రసాయనాలు చాలామందికి సరిపడవు. ఈ విషయంలో అశ్రద్ధ చేయకుండా, అలాంటి పనులు చేసేటప్పుడు గ్లవ్స్ ధరించాలి.
గోళ్లు పెరిగేకొద్దీ, వాటిలో హానికారక బ్యాక్టీరియా పేరుకునే ప్రమాదం ఉంటుంది. విరిగిపోవడం, గుచ్చుకోవడం
జరుగుతుంటుంది. అందుకని గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి.
గోరు చుట్టూ ఉండే పల్చటి చర్మాన్ని క్యూటికల్స్ అంటారు. గోళ్లు మరింత అందంగా కనిపించాలనే తాపత్రయంతో
చాలామంది వాటిని చిగురు వెనక్కి వెళ్లేలా షేప్ చేస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లకు అవకాశం ఉంటుందని గ్రహించాలి.