పుస్తక పఠనం.. పునరాగమనం!
‘పుస్తకం హస్తభూషణం’ అని నానుడి. ఒకప్పుడు అత్యంత ఆరోగ్యకరమైన అలవాట్లలో.. ‘పుస్తక పఠనం’ అగ్రస్థానంలో ఉండేది. కానీ, కాలగమనంలో ఆ స్థానాన్ని ‘స్మార్ట్‌ఫోన్' కబ్జా చేసింది. నయా ‘హస్తభూషణం’గా మారిపోయింది. పెరిగిన స్క్రీన్టైమ్; వ్యసనంగా మారిన స్క్రోలింగ్‌తో నవతరం అనారోగ్యాల పాలవుతున్నది. ఈ క్రమంలోనే మరో విప్లవాత్మక మార్పు మొదలైంది. పుస్తక పఠనం.. ఠీవీగా పునరాగమనం చేసింది.
‘పుస్తకం హస్తభూషణం’ అని నానుడి. ఒకప్పుడు అత్యంత ఆరోగ్యకరమైన అలవాట్లలో.. ‘పుస్తక పఠనం’ అగ్రస్థానంలో ఉండేది. కానీ, కాలగమనంలో ఆ స్థానాన్ని ‘స్మార్ట్‌ఫోన్’ కబ్జా చేసింది. నయా ‘హస్తభూషణం’గా మారిపోయింది. పెరిగిన స్క్రీన్టైమ్; వ్యసనంగా మారిన స్క్రోలింగ్‌తో నవతరం అనారోగ్యాల పాలవుతున్నది. ఈ క్రమంలోనే మరో విప్లవాత్మక మార్పు మొదలైంది. పుస్తక పఠనం.. ఠీవీగా పునరాగమనం చేసింది. జెన్-జెడ్‌లో పుస్తకాలు చదివే అలవాటు పెరుగుతున్నది. సాంకేతికత ఎంత పెరిగినా మనిషి మళ్లీ తన మూలాలకే చేరుకుంటాడనడానికి.. పుస్తక పఠనంపై జెన్-జెడ్ చూపుతున్న ఆసక్తే నిదర్శనంగా కనిపిస్తున్నది.
కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు.. తాము స్మార్ట్ గ్యాడ్జెట్స్‌తోనే ఈ భూమ్మీదికి వచ్చినట్లు ఫీలవుతుంటారు కొందరు. పొద్దున లేచించి మొదలు రాత్రి పడుకునేదాకా.. ప్రతిక్షణం ఏదో ఓ గ్యాడ్జెట్తోనే గడిపేస్తుంటారు. అలా ఈ జెన్-జెడ్ తరం డిజిటల్ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా మునిగిపోయిన తరంగా పేరు తెచ్చుకుంటున్నారు. ఆ పేరుతోపాటే లేనిపోని అనారోగ్య సమస్యలకూ గురవుతున్నారు. స్మార్ట్ స్క్రీన్లకే పరిమితమై.. సామాజికంగా వెనకబడిపోతున్నారు. ఈ క్రమంలో బుక్‌టాక్, బుక్‌స్టాగ్రామ్ లాంటి వేదికలు.. యువతను పుస్తక పఠనంవైపు మళ్లించడానికి ముందుకొచ్చాయి. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విప్లవాన్నే సృష్టించాయి. పుస్తకాల గురించి రాసిన రివ్యూలు, లైబ్రరీలను అందంగా చూపిస్తూ తీసిన వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి.
పుస్తక పఠనాన్ని ఆకట్టుకునేలా మార్చేశాయి. దృశ్యపరంగా, భావోద్వేగపరంగా యువతకు కనెక్ట్ చేశాయి. ఇక జెన్-జెడ్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్న ‘డిజిటల్ ఫెటిగ్’ కూడా.. వారిలో ఈ అనూహ్య మార్పు రావడానికి ఓ కారణమైంది. అదే సమయంలో నిరంతరం ఆన్లైన్లో ఉండటం నవతరంలో ఒత్తిడి పెరుగుతున్నది. ఇలాంటివారికి పుస్తకాలు తోడుగా నిలుస్తున్నాయి. వారిని విభిన్న ప్రపంచంలోకి, లోతైన భావోద్వేగాల్లోకి తీసుకెళ్తున్నాయి. నిజ జీవితంలో కొరవడే ఓదార్పును అందిస్తున్నాయి. వారు కోల్పోతున్న ఏకాగ్రత, ఓర్పు, వర్తమానంలో ఉండటం లాంటివన్నీ పుస్తక పఠనం అందిస్తున్నది. దాంతో వేలమంది పుస్తక పఠనాన్ని ఆరోగ్యకరమైన అలవాటుగా మార్చుకుంటున్నారు. అదికూడా ఒక కాలక్షేపంగా కాకుండా.. ఒక జీవనశైలి ఎంపికగా దీనిని ఫాలో అవుతున్నారు.

Book Reading
విప్లవాత్మక మార్పే!
అస్థిరతకు మారుపేరుగా నిలిచే జెన్-జెడ్ తరం.. ఒక్క దగ్గర కూర్చుని శ్రద్ధగా పుస్తకం చదవాలని నిర్ణయించుకోవడం ఒక విప్లవాత్మక మార్పే! ఇక ఈ పుస్తక పఠనాన్ని కేవలం ఒక అలవాటుగా కాకుండా.. ఒక ట్రెండ్‌గా మార్చేస్తున్నారు వీళ్లు. కేవలం ఒక పుస్తకాన్ని పూర్తి చేయాలన్నట్టుగా కాకుండా.. ఆ పుస్తకంలోని పాత్రలతో మమేకం అవుతున్నారు. ఆ పుస్తకంలోని పేజీలలో తమను తాము ప్రతిబింబంగా చూసుకుంటున్నారు కూడా! ఈ క్రమంలో గ్రంథాలయాలు, పుస్తకాల దుకాణాలు, బుక్ క్లబ్స్‌కు క్యూ కడుతున్నారు. ఆన్లైన్ సంభాషణల కంటే.. ఇక్కడే తమదైన సామూహిక భావనను పొందుతున్నారు. పుస్తకాల కోసం వెతకడం, కొత్త రచయితలను గుర్తించడం, కథల గురించి ఇతరులతో చర్చించడంలో మునిగిపోతున్నారు.
అలా.. డిజిటల్ అనుభవానికి మించిన సరికొత్త అనుబంధాన్ని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా కళ్లకు విశ్రాంతిని అందిస్తూ.. చేతిలో పుస్తకాన్ని పట్టుకుని చదవడాన్ని ఒక మెడిటేషన్‌లాగా ఫీలవుతున్నారు. ఇందులోకీ డిజిటల్ పరికరాలను రానివ్వకుండా.. కిండిల్, ఈ-బుక్స్ కంటే ముద్రించిన పుస్తకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పుస్తకం వాసన, పేజీలు తిప్పడం, బుక్ షెల్ఫ్‌లో వాటిని అందంగా అమర్చుకోవడం కూడా తమకు ఒక ప్రత్యేకమైన తృప్తిని అందిస్తున్నదని చెబుతున్నారు. మరికొందరు డిజిటల్ డిటాక్స్గానే కాకుండా.. పుస్తక పఠనాన్ని స్టేటస్ సింబల్‌గానూ చూస్తున్నారు. కాఫీ షాపుల్లో కూర్చుని పుస్తకం చదవడం, చదివిన పుస్తకాల గురించి సోషల్ మీడియాలోనూ చర్చిస్తున్నారు. అయితే, ఈ అలవాటు ఓ తాత్కాలిక ట్రెండ్‌లా కాకుండా.. నిరంతరం కొనసాగే మంచి అలవాటుగా మారాలని పెద్దలు ఆశిస్తున్నారు.

Book Reading
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

