Skin Care | ముఖారవిందం కోసం మంచు మర్దన చేసేద్దాం
కాలం ఏదైనా స్కిన్ కేర్ తప్పనిసరి. లేదంటే చర్మంపై ట్యాన్ ఏర్పడి ముఖారవిందం ముడుచుకుపోయినట్టు అవుతుంది. ఎండవేడిమికి కమిలిపోయిన చర్మానికి తిరిగి నిగారింపు తెచ్చేందుకు చాలామంది పార్లర్లకు వెళ్తుంటారు. అయితే, ఐస్ ఫేషియల్‌తో ఇంటిపట్టునే ముచ్చటైన రూపాన్ని సొంతం చేసుకోవచ్చు.
కాలం ఏదైనా స్కిన్ కేర్ తప్పనిసరి. లేదంటే చర్మంపై ట్యాన్ ఏర్పడి ముఖారవిందం ముడుచుకుపోయినట్టు అవుతుంది. ఎండవేడిమికి కమిలిపోయిన చర్మానికి తిరిగి నిగారింపు తెచ్చేందుకు చాలామంది పార్లర్లకు వెళ్తుంటారు. అయితే, ఐస్ ఫేషియల్‌తో ఇంటిపట్టునే ముచ్చటైన రూపాన్ని సొంతం చేసుకోవచ్చు.
Skin Care | చర్మాన్ని సహజంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఐస్ ఫేషియల్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీనిని క్రయోథెరపీగా చెబుతారు. ఐస్ లేదా కోల్డ్ క్రంపెస్లను ఉపయోగించి ముఖానికి రాసుకోవాలి. ఐస్ క్యూబ్స్‌ని మృదువైన క్లాత్‌లో వేసి మర్దన చేసుకోవాలి. కోల్డ్ ఫేషియల్ రోల్స్‌ను కూడా ఉపయోగించొచ్చు. ముఖంపై ఉండే చర్మానికి నిగారింపు ఇవ్వడమే కాకుండా వేడి నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.
చల్లగా ఉండే ఐస్‌తో మసాజ్ చేయడం వల్ల చర్మంపై ఉండే రక్తనాళాలు సంకోచిస్తాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. స్కిన్ టోన్ మెరుగవుతుంది. కళ్లు ఉబ్బడం తగ్గుతాయి. కంటి కింద ఉండే నల్లటి వలయాలు క్రమంగా మాయమవుతాయి.
మొటిమల సమస్యతో ఐస్ ఫేషియల్ మంచి పరిష్కారం. మొటిమల వల్ల వచ్చే వాపు, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మంపై జిడ్డు కూడా తగ్గుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఐస్ ఫేషియల్ చేసుకునే ముందు ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖంపై దుమ్ము లేకుండా చూసుకోవాలి. ఐస్‌క్యూబ్‌ను నేరుగా ముఖంపై పెట్టుకోకూడదు. సాఫ్ట్ టిష్యూలోగానీ, కాటన్ క్లాత్‌లో గానీ ఐస్ క్యూబ్ వేసుకొని ముఖంపై నెమ్మదిగా మసాజ్ చేయాలి. లేదంటే కోల్ట్ ఫేషియల్ రోలర్ని ఉపయోగించాలి. ఒకటి నుంచి రెండు నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత కాసేపు ఆపాలి. లేదంటే చల్లదనానికి మంటపుడుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

