Junk Food | మీకు జంక్‌ఫుడ్ అలవాటైందా.. అందులోంచి ఇలా బయటపడండి!
టీవీ చూస్తూ చిప్స్.. మూవీకెళ్తే ఫ్రెంచ్‌ఫ్రైస్.. సండే వస్తే బర్గర్.. పండుగొస్తే పిజ్జా.. ఇలా జంక్‌ఫుడ్ జంక్షన్లో ఈ తరం చిక్కుకుపోయింది. మళ్లీ మళ్లీ తినాలనిపించే జంక్‌ఫుడ్.. ఊబకాయానికి దారితీస్తుంది. అనారోగ్యానికి బాటలు పరుస్తుంది.
Junk Food | టీవీ చూస్తూ చిప్స్.. మూవీకెళ్తే ఫ్రెంచ్‌ఫ్రైస్.. సండే వస్తే బర్గర్.. పండుగొస్తే పిజ్జా.. ఇలా జంక్‌ఫుడ్ జంక్షన్లో ఈ తరం చిక్కుకుపోయింది. మళ్లీ మళ్లీ తినాలనిపించే జంక్‌ఫుడ్.. ఊబకాయానికి దారితీస్తుంది. అనారోగ్యానికి బాటలు పరుస్తుంది. వీటి తయారీలో ఉపయోగించే కొవ్వులు జీర్ణశక్తిని మందగించేలా చేస్తాయి. జంక్‌ఫుడ్ అలవాటైతే అందులోంచి బయటపడటం అంత తేలిక కాదు! హాని కలిగించే ఈ చిరుతిళ్లు మానడానికి ఈ సూత్రాలు పాటించండి..
జంక్‌ఫుడ్ మానాలనుకున్నప్పుడు మొదట మీ ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. ఇంట్లోనే బెల్లం ఉండలు, చెగోడీలు లాంటి చిరుతిళ్లు తయారు చేసి అందుబాటులో ఉంచడం మంచిది.
పిల్లలకు భోజనం మొక్కుబడిగా కాకుండా ఆస్వాదిస్తూ తినడం అలవాటు చేయండి. వారి ఆకలి వేళలకు తగ్గట్టుగా ఇష్టమైన ఆహార పదార్థాలను సిద్ధం చేయండి.
ఆరోగ్యవంతమైన ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి అప్పుడప్పుడూ చెబుతూ ఉండాలి. అడపాదడపా వారికి ఇష్టమైన వెరైటీలను బయట తినిపించొచ్చు.
పిల్లలు ఇష్టంగా తింటున్న జంక్‌ఫుడ్ ఏంటో గుర్తించి… ఆ వెరైటీని ఇంట్లోనే చేయండి. ఇలా చేస్తే అనవసరమైన కొవ్వు, నిల్వ రసాయనాల ముప్పు నుంచి మీ చిన్నారులను తప్పించవచ్చు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

