గీతా గాగ్రా
అంబానీ ఇంట పెండ్లిసందడి ముగిసి వారం గడిచినా.. ఆ వేడుక ముచ్చట్లు నెట్టింట ఇంకా చక్కర్లు కొడుతున్నాయి. నీతా అంబానీ చీరకట్టు..
అంబానీ ఇంట పెండ్లిసందడి ముగిసి వారం గడిచినా.. ఆ వేడుక ముచ్చట్లు నెట్టింట ఇంకా చక్కర్లు కొడుతున్నాయి. నీతా అంబానీ చీరకట్టు.. ఈశా అంబానీ ధరించిన జాకెట్టు.. ఇవన్నీ ఇంకా వైరల్ అవుతున్నాయి. నూతన వధూవరుల కన్నా ఈ తల్లీకూతుళ్ల ముస్తాబుపైనే నెట్టింట ముచ్చట్లు నడుస్తున్నాయి. ఈ వేడుకలో పూటపూటకూ సరికొత్త ఆహార్యంతో అలరించిన ఈశా.. శివశక్తి పూజ సందర్భంగా ధరించిన లెహంగా టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది.
ఈ కార్యక్రమానికి అంబానీ పరివారమంతా సంప్రదాయ దుస్తుల్లో హాజరైంది. ఈశా ఆగ్రా తాజ్మహల్ కన్నా వేడుకైన గాగ్రా ధరించింది. దీనిపై అలనాటి అలంకారాలు, భారతీయ సంప్రదాయాన్ని చాటిచెప్పే చిత్తరువులు ముద్రించారు.
ఈ ప్రత్యేకతలు చాలవన్నట్టు గీతాసారాన్ని చాటిచెప్పే ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్తకర్మణి’ అనే శ్లోకం కూడా గాగ్రాపై లిఖించి ఉంది. ‘పని చెయ్.. ఫలితం ఆశించకు’ అని ఈ శ్లోకార్థం. సిరిగలవారు ఏం చేసినా చెల్లున్! అయితే, ఒంటిమీద ధరించే దుస్తులపై గీతాశ్లోకం రాయడం ఏంటని కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

