షారుక్ ఖాన్ భార్యగా గౌరీఖాన్ మనకు పరిచయమే. తను ఓ మంచి ఇంటీరియర్ డిజైనర్ అనే విషయం చాలామందికి తెలియదు. ఖరీదైన ఇళ్లు, ఆఫీసులు, రెస్టారెంట్లకు ఘనంగా డిజైనింగ్ చేస్తారు. తాజాగా ‘టోరి’ అనే రెస్టారెంట్‌కు సహ యజమానిగా మారారు. ఆ ఆవరణను తన స్వహస్తాలతో డిజైన్ చేశారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం.. బాంద్రాలో సదరు రెస్టారెంట్ ఉంది.
నాలుగున్నర వేల చదరపు అడుగుల సువిశాల ఆవరణలో ఎనభై మంది కూర్చునే అవకాశం ఉంది. మారియట్ లాంటి పేరున్న హోటల్స్‌లో పనిచేసిన స్టీఫెన్ చీఫ్ చెఫ్‌గా వ్యవహరిస్తున్నారు. భారతీయ, పాశ్చాత్య రుచుల మేళవింపుతో వంటకాలు బావుంటాయని పేరొచ్చింది. ధరలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి మరి. సాయంత్రం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు నడుస్తుంది.