Watermelon | పుచ్చకాయ కొనే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

పుచ్చకాయ ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుందని చాలామంది అపోహ పడతారు. కానీ అది నిజం కాదు.. పుచ్చకాయ రుచికి దాని పరిమాణానికి సంబంధం లేదు. కాయ ఏ సైజ్లో ఉన్నా సరే.. పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలి. అలా బరువుగా ఉంటే కాయ లోపల నీళ్లు, గుజ్జు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడూ సాధారణ సైజ్లో ఎక్కువ బరువు ఉన్న కాయలనే ఎంచుకోవాలి.

ఎండాకాలంలో విరివిగా కనిపించే పండ్లలో ఒకటి పుచ్చకాయ. వేసవి తాపాన్ని తగ్గించి, శరీరానికి ఉత్తేజాన్ని ఇవ్వడంలో వీటిని మించి మరొకటి లేదనే చెప్పొచ్చు. 95 శాతం వరకు నీరే ఉన్న ఈ పండును తినడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. అందుకే సమ్మర్ వచ్చిందంటే వీటికి గిరాకీ బాగుంటుంది. అయితే వీటిలో ఎలాంటి కాయలను కొనాలి? ఏవి ఎర్రగా, మంచి రుచితో ఉంటాయో చాలా మంది గుర్తించలేరు. దీంతో అమ్మేవాడు చెప్పిన కాయలు తెచ్చి ఒక్కోసారి మోసపోతుంటారు. అందుకే పుచ్చకాయలను కొనేముందు ఈ చిట్కాలు ఫాలో అయితే మంచి కాయను కొనుక్కోవచ్చు.

పుచ్చకాయలో ఆడ, మగ జాతులు కూడా ఉంటాయి. ఆడ పుచ్చకాయలు చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. మగ పుచ్చకాయలు పొడుగ్గా, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. వీటిలో నీటి శాతం, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. అదే తియ్యటి కాయ కావాలంటే ఆడపుచ్చ కాయను తీసుకోవడం మేలు.

చాలామంది పచ్చగా కనిపించే పుచ్చకాయలను కొంటుంటారు. అవి తాజాగా ఉంటాయని అనుకుంటారు. కానీ అలాంటి కాయలు పూర్తిగా పండక.. చప్పగా అనిపిస్తుంటాయి. నిజానికి పూర్తిగా పండిన పుచ్చకాయ ముదురు పచ్చ రంగులో ఉంటుంది. అలాంటి కాయలే రుచిగా ఉంటాయి.

కొన్ని పుచ్చకాయలపై ఒకవైపు తెలుపు, గోధుమ రంగు మచ్చలు చూసే ఉంటారు. ఈ మచ్చలు ఎంత ముదురు రంగులో ఉంటే ఆ కాయ అంత రుచిగా ఉంటుంది. కొన్ని కాయలపై పిచ్చి గీతలు గీసినట్లు గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఈ కాయలు చాలా రుచిగా ఉంటాయి. ఈ మచ్చలు కూడా తేనెటీగలు పదే పదే వాలడం వల్ల ఏర్పడతాయంట.

పుచ్చకాయ తొడిమను చూసి కూడా కాయ రుచి ఎలా ఉంటుందో చెప్పొచ్చు. తొడిమ ఎండిపోయినట్లు ఉంటే ఆ కాయ బాగా పండిందని అర్థం. అలా కాకుండా తొడిమ పచ్చిగా ఉంటే ఇంకా ఆ కాయ పండలేదనే చెప్పొచ్చు.

పుచ్చకాయను ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసినప్పుడు తియ్యటి వాసన వస్తుంది. మరి తియ్యగా వస్తే మాత్రం ఆ కాయను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ కాయ బాగా పండి.. మురిగిపోయేందుకు దగ్గరలో ఉందన్నమాట.

పుచ్చకాయను కొనేముందు దానిపై వేళ్లతో కొట్టడం ద్వారా ఆ కాయ ఎలాంటిదో కనుక్కోవచ్చు. పుచ్చకాయను వేళ్లతో తాకినప్పుడు గుల్లలా టక్ టక్ అని శబ్దం వస్తే ఆ కాయ బాగా పండిందని చెప్పొచ్చు. అదే శబ్దం రాకపోతే ఆ కాయ ఇంకా పండాల్సి ఉందని అర్థం
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
