మేఘాలలో తేలిపోదాం..
టిబెట్ ఒకవైపు.. భూటాన్ ఇంకోవైపు.. సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తులో.. ఆకాశాన్ని ముద్దాడే హిమాలయా పర్వతాల నడుమ ఉన్న మనోహరమైన పర్యాటక కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్. బౌద్ధ ఆరామాలు, జలపాతాలు, వ్యూ పాయింట్లు, ప్రశాంతమైన సరస్సులు తవాంగ్‌ను ట్రావెలోకంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి.
టిబెట్ ఒకవైపు.. భూటాన్ ఇంకోవైపు.. సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తులో.. ఆకాశాన్ని ముద్దాడే హిమాలయా పర్వతాల నడుమ ఉన్న మనోహరమైన పర్యాటక కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్. బౌద్ధ ఆరామాలు, జలపాతాలు, వ్యూ పాయింట్లు, ప్రశాంతమైన సరస్సులు తవాంగ్‌ను ట్రావెలోకంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. అంతటా అందనంత ఎత్తులో కనిపించే నీలిమేఘాలు.. ఇక్కడ మాత్రం తమకంటే ఎత్తులో ఠీవీగా నిల్చున్న శిఖరాగ్రాలను చూసి.. సిగ్గుతో ముందుకు కదలిపోతుంటాయి.
ఆహ్లాదకరమైన వాతావరణం అందరినీ అలరిస్తుంది. వేసవిలో ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలలోపే నమోదవుతాయి. ఇక్కడి తవాంగ్ ఆరామం మనదేశంలోని అతిపెద్ద బౌద్ధమఠంగా విరాజిల్లుతున్నది. ఇక్కడ వందల మంది బౌద్ధ విద్యార్థులను చూడొచ్చు.
ఇదే ఆరామంలోని 27 అడుగుల బంగారు బుద్ధ విగ్రహాన్ని ఎంతసేపైనా చూస్తూ ఉండిపోవచ్చు. తవాంగ్, పరిసర ప్రాంతాల్లో ఎన్నో పర్యాటక విశేషాలు ఉన్నాయి. సెల్పాస్ (తవాంగ్‌లోకి దారితీసే ప్రధాన మార్గం. 13,700 అడుగుల ఎత్తులో ఉంటుంది) మనసును కట్టిపడేస్తుంది. బాప్ టంగ్ జలపాతం హొయలు ఎంతసేపు చూసినా తనివితీరదు. తవాంగ్ వార్ మెమొరియల్ హృద్యమైన గాథను వివరిస్తుంది. జస్వంత్ ఘర్ (యుద్ధవీరుడు జస్వంత్సంగ్ నిలయం) వీరోచిత విన్యాసాన్ని గుర్తు చేస్తుంది. ఇక ఇక్కడి సరస్సుల్లో పడవ ప్రయాణం జీవితకాలం గుర్తుండిపోతుంది.
చేరుకునేదిలా: తవాంగ్ చేరుకోవాలంటే ముందుగా అసోం రాజధాని గువాహటికి వెళ్లాలి. అక్కడి నుంచి తవాంగ్‌కు 480 కిలోమీటర్ల దూరం. బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. ఘాట్ రోడ్డు మీదుగా సాగే ఈ ప్రయాణం భలేగా ఉంటుంది. గువాహటి నుంచి తేజ్‌పూర్ (180 కి. మీ) మీదుగా కూడా తవాంగ్ వెళ్లొచ్చు. తేజ్‌పూర్ నుంచి తవాంగ్ (325 కి.మీ) బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి గువాహటికి రైళ్లు, విమానాలు అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

