ఉడికించిన కూరలు, పండ్లరసాల కంటే... పచ్చికూరలు, పండ్లు నేరుగా తినడం వల్ల ఎక్కువ లాభం ఉంటుందని తెలిసిందే! కానీ, ఆ సలాడ్నురుచిగా, ఆకర్షణీయంగా, ఆరోగ్యకరంగా చేసుకోవడం ఎలా! ఇలా...
ఉడికించిన కూరలు, పండ్లరసాల కంటే… పచ్చికూరలు, పండ్లు నేరుగా తినడం వల్ల ఎక్కువ లాభం ఉంటుందని తెలిసిందే! కానీ, ఆ సలాడ్నురుచిగా, ఆకర్షణీయంగా, ఆరోగ్యకరంగా చేసుకోవడం ఎలా! ఇలా…
సలాడ్‌లో పోషకాలు ఎక్కువగా ఉండే పాలకూరలాంటి ఆకుకూరలు జోడించడం వల్ల పొటాషియం లాంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.
సలాడ్‌కు బాదంపప్పు, చియాగింజలు, క్యాబేజ్, చిలగడదుంప లాంటివి కలిపితే విటమిన్లు, పీచుపదార్థాలు లభించడంతోపాటు రుచిగానూ ఉంటాయి.
ఉడకబెట్టిన గుడ్డు, వండిన చికెన్ గానీ, చేపలు గానీ, బీన్స్ సలాడ్‌లో ఉంటే మరిన్ని ప్రొటీన్లు అందుతాయి.
టమాటా, బీట్రూట్, దానిమ్మ గింజలు లాంటివి సలాడ్‌లో కలిపితే అది రంగురంగులుగా ఆకర్షణీయంగా మారుతుంది.
పండ్లలో ఉండే పోషకాలు కూడా సలాడ్ ద్వారా దక్కేందుకు యాపిల్, స్ట్రాబెరీస్ ముక్కలు కలపొచ్చు.