కాస్త.. మీ గురించి కూడా!
మహిళలు తమ వ్యక్తిగత సమస్యలను కొంతైనా పట్టించుకోవాలని బాలీవుడ్ నటి గుల్ పనాగ్ సలహా ఇచ్చింది. ‘ఫ్యామిలీమ్యాన్' వెబ్‌సిరీస్‌తో ఓవర్‌నైట్‌లో ఓటీటీ స్టార్ అయిపోయిన ఆమె.. నెలసరి విషయంలో మహిళలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలని చెప్పుకొచ్చింది. ‘మహిళల ఆరోగ్యం, సాధికారత ఐక్యతతోనే మొదలవుతుంది. ఆ దిశగా అడుగులు వేయాలి. కుటుంబ పోషణలో స్త్రీలు ఎంతో బాధ్యతగా నడుచుకుంటారు.
మహిళలు తమ వ్యక్తిగత సమస్యలను కొంతైనా పట్టించుకోవాలని బాలీవుడ్ నటి గుల్ పనాగ్ సలహా ఇచ్చింది. ‘ఫ్యామిలీమ్యాన్’ వెబ్‌సిరీస్‌తో ఓవర్‌నైట్‌లో ఓటీటీ స్టార్ అయిపోయిన ఆమె.. నెలసరి విషయంలో మహిళలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలని చెప్పుకొచ్చింది. ‘మహిళల ఆరోగ్యం, సాధికారత ఐక్యతతోనే మొదలవుతుంది. ఆ దిశగా అడుగులు వేయాలి. కుటుంబ పోషణలో స్త్రీలు ఎంతో బాధ్యతగా నడుచుకుంటారు. ఈ క్రమంలో వారి ప్రాధాన్యాన్ని వాళ్లు తగ్గించుకుంటారు. ఆరోగ్యాన్నీ నిర్లక్ష్యం చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టిపెట్టక ఎందరో స్త్రీలు మలి వయసంతా అనారోగ్యంతోనే సహవాసం చేస్తారు’ అని చెప్పుకొచ్చింది గుల్ పనాగ్. ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్లో ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. తల్లిదండ్రులు, కట్టుకున్నవాడు, పిల్లల విషయంలో స్త్రీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో.. తన ఆరోగ్య విషయంలోనూ అదే శ్రద్ధను చూపాలని సూచించింది. ‘నా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం ద్వారానే నేను విజయవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాను’ అనే గుల్ పనాగ్ మాటలు మహిళలు ఆచరించదగ్గవి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Family Man
- gul panag
- ott
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

