సర్వైకల్ క్యాన్సర్ రాకుండా..
సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్లను తొమ్మిదేళ్ల నుంచి పదిహేనేళ్లలోపు ఆడపిల్లలైతే.. రెండు డోసులు వేయించాలి. తొలిడోసు తర్వాత ఆరునెలలకు మరో డోసు వేస్తారు. ఒక్కో డోస్ రెండు వేల దాకా అవుతుంది. పెద్దవాళ్లు కూడా వేయించుకునే వీలుంది.
డాక్టర్ గారూ నమస్తే. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏ వయసులో వేసుకోవాలి. ఇలాంటి క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్లు మార్కెట్లో ఇంకేమైనా ఉన్నాయా? ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కడ లభిస్తాయి?
- ఓ పాఠకురాలు
సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్లను తొమ్మిదేళ్ల నుంచి పదిహేనేళ్లలోపు ఆడపిల్లలైతే.. రెండు డోసులు వేయించాలి. తొలిడోసు తర్వాత ఆరునెలలకు మరో డోసు వేస్తారు. ఒక్కో డోస్ రెండు వేల దాకా అవుతుంది. పెద్దవాళ్లు కూడా వేయించుకునే వీలుంది. నిజానికి, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను 45 ఏళ్ల వయసులోనూ తీసుకోవచ్చు. కాకపోతే, పెళ్లికి ముందు అయితే మంచిది. ఎందుకంటే, ఈ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల వస్తుంది. ఇది సంభోగం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
హెచ్‌పీవీలో చాలా రకాలు ఉంటాయి. అలా అని, అన్నిటి వల్లా క్యాన్సర్ రాదు. హైరిస్క్ హెచ్‌పీవీ వల్ల మాత్రమే క్యాన్సర్ వస్తుంది. శరీరంలో ఉండేది మామూలు వైరసా, హైరిస్క్ వైరసా అనేది బయటికి తెలియదు కాబట్టి, లైంగిక జీవితం ప్రారంభించకముందే ఈ వ్యాక్సిన్లు తీసుకుంటే మంచిది. ఇవి వేయించుకున్నా సరే.. పెళ్లయ్యాక లేదా సెక్స్ జీవితం ప్రారంభించిన మూడేళ్ల తర్వాత పాప్‌స్మియర్ తప్పకుండా చేయించుకోవాలి.
పదిహేను దాటాక అయితే, మొదటి డోసు తర్వాత రెండు నెలలకు ఒకటి, ఆరునెలలకు మరొకటి చొప్పున మూడు డోసులు తీసుకోవాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా దాదాపు 80 శాతం వరకూ ఇవి నియంత్రించగలవు. మిగతా క్యాన్సర్లకు ఎలాంటి వ్యాక్సిన్లూ అందుబాటులో లేవు. ఏ వయసు వాళ్లయినా వేసుకోగలిగే మరో వ్యాక్సిన్ హెపటైటిస్-బి. ఇది లివర్ క్యాన్సర్ రాకుండా అరికడుతుంది. కామెర్లతో వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. హెపటైటిస్-బి పరీక్ష నెగెటివ్ వస్తే ఈ డోస్ వేయించుకోవచ్చు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

