ఇష్టమైన అమ్మాయిని ‘బంగారం!’ అని ముద్దుగా పిలుచుకుంటాడు పడుచు ప్రేమికుడు. ఆ సింగారాల బంగారం తనువెల్లా నగలే అయితే.. ఇంకేమని సంబోధిస్తాడో! ఓ జువెలరీ సంస్థ ‘గోల్డ్ రష్ 2023 కలెక్షన్’లో భాగంగా వినూత్నమైన నగలను మార్కెట్లో విడుదల చేసింది. వాటిని ఓ మాడల్కు అలంకరించి ఫొటోషూట్ నిర్వహించింది. ఆ మెరుపులే ఇవన్నీ.