ఇంట్లో ఫేస్‌మాస్క్‌లు తయారు చేసుకుని, వేసుకుని, ఆరేదాకా ఎదురుచూసేంత తీరిక కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు చిటికెలో ఫలితం చూపించే ఫేస్ షీట్ మాస్క్‌లు మార్కెట్లోకి వచ్చాయి. సెల్యులోజ్‌తో తయారయ్యే ఈ మాస్క్‌ల మీద ఇప్పుడు ప్రింట్లు కూడా వస్తున్నాయి. ‘విటమిన్స్క్యూ’ సంస్థ రూపొందించిన ఈ మెటాలిక్ షీట్ మాస్క్ అందులో ఒకటి.
హ్యాలురానిక్ యాసిడ్, గ్లిజరిన్లాంటి వాటి సుగుణాలతో తయారైన ఈ మాస్క్ ముఖాన్ని తేమగా ఉంచేందుకు చర్మానికి సాంత్వన చేకూర్చేందుకు సాయపడుతుంది. విభిన్న రకాల పువ్వులు, పండ్ల నుంచి తీసిన రంగులను వీటి మీద ప్రింట్ల కోసం వినియోగిస్తున్నారు. ‘ఫేస్‌మాస్క్ వేసుకుని ఇన్‌స్టాలో పోస్ట్ చేయాలంటే, ఇంతకు మించి ఆకర్షణీయమైనది ఏముంటుంది’.. అంటున్నారు వీటిని చూసిన నెటిజన్లు.