Soured Milk | విరిగిపోయిన పాలను పారబోస్తున్నారా? వాటితో ఇలా చేయొచ్చని తెలుసా
Soured Milk | పాలు విరిగిపోవడం సహజమే. అలాంటప్పుడు మీరేం చేస్తారు? పగిలిపోయిన పాలను ఏం చేస్తాం.. చెత్తలో పారబోయడమే అని అంటారా? కానీ విరిగిన పాల ( Spoiled Milk ) తో కమ్మని వంటకాల్ని తయారుచేసుకోవచ్చు.
Soured Milk | పాలు విరిగిపోవడం సహజమే. అలాంటప్పుడు మీరేం చేస్తారు? పగిలిపోయిన పాలను ఏం చేస్తాం.. చెత్తలో పారబోయడమే అని అంటారా? కానీ విరిగిన పాల ( Spoiled Milk ) తో కమ్మని వంటకాల్ని తయారుచేసుకోవచ్చు. వంటకాలు మాత్రమే కాదు సౌందర్య సాధనంగా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఎరువుగా వేసి మొక్కలను ఏపుగా పెంచవచ్చు. మరి విరిగిన పాలతో ఏమేమీ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం..
కొన్నిసార్లు పాలు వేడిచేయగానే విరిగిపోతాయి. ఆ పాలను పారపోయకుండా వాటికి గుడ్డు కలిపి మెత్తగా, మృదువుగా చేయాలి. దీనిని ఉపయోగించి స్వీట్కోవా తయారు చేయారుచేసుకుంటే రుచికరంగా ఉంటుంది.
పాలు విరిగాయని తెలియగానే వాటిని పక్కన పెట్టేయాలి. అందులో కొంచెం చక్కెర వేసి కలుపుకొని తింటే జున్నులా టేస్టీగా ఉంటుంది.
విరిగిన పాలను పారపోయకుండా వాటిని పోపులో వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే పెరుగు పులుసులా ఉంటుంది.
విరిగిన పాలను పూలకుండీలో పోస్తే ఎరువుగా తయారవుతుంది. దీనిలో ఉండే క్యాల్షియం మొక్కని ఆరోగ్యంగా ఉంచుతుంది. తయారయిన ఎరువు టమాటా మొక్కకు మంచిగా ఉపయోగపడుతుంది.
చేపల్ని శుభ్రపరిచేందుకు ఉప్పు, నిమ్మకాయ ఉపయోగిస్తారు. వాటితో పాటు విరిగిన పాలను ఉపయోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. దీంతో చేపలు శుభ్రపడడమే కాదు కూరకు మంచి రుచి కూడా వస్తుంది.
శీతాకాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. చర్మానికి మాయిశ్చరైజ్ ఇచ్చేందుకు విరిగిన పాలలో కొంచెం తేనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

