Health Tips | పసుపు సహజ ఔషధం.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
Health Tips | వివిధ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి పసుపు సహజ ఔషధంలా పనిచేస్తుంది. చిన్నచిన్న గాయాలైనప్పుడు ఆ గాయంపై చిటికెడు పసుపు వేస్తే సెప్టిక్ కాకుండా ఉంటుంది. గాయం త్వరగా మానిపోతుంది.
పసుపు..! మానవ జీవన విధానంలో పసుపునకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. పసుపు ప్రాముఖ్యం గురించి పెద్దవాళ్లు కూడా చెబుతుంటారు. వివిధ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి పసుపు సహజ ఔషధంలా పనిచేస్తుంది. చిన్నచిన్న గాయాలైనప్పుడు ఆ గాయంపై చిటికెడు పసుపు వేస్తే సెప్టిక్ కాకుండా ఉంటుంది. గాయం త్వరగా మానిపోతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే సీజనల్ సమస్యలకు పసుపు చక్కని పరిష్కారం చూపుతుంది.
పసుపుతో ప్రయోజనాలు..
1. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా, యాంటీ ఇన్ఫ్లామెటరీగా పనిచేస్తుంది. ఈ కారకాలు మన శరీరంలో నొప్పి నివారణిలుగా పనిచేస్తాయి.
2. పసుపు యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. ఎక్కువ శీతాకాలంలో వేధించే జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల నివారణలో మంచి ప్రయోజనకారిగా ఉంటుంది.
3. పసుపునకు వేడిని ఉత్పత్తి చేసే లక్షణం ఉంటుంది. ఈ లక్షణం కణాల పనితీరును సక్రమంగా ఉంచుతుంది. వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
4. కీళ్ల నొప్పులకు కూడా పసుపు ఔషధంలా పనిచేస్తుంది. టీ లేదా పాలలో ఒక చిటికెడు పసుపు వేసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
5. పసుపులోని శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు విషాలను విచ్ఛిన్నం చేసే గుణం కలిగి ఉంటాయి. అందువల్ల పసుపు కాలేయాన్ని విషరహితం చేయడంలో తోడ్పడుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

