Detox Drinks | చీర్స్ టు డీటాక్స్ డ్రింక్స్!.. శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు తొలగించుకుందాం!
దసరా, దీపావళి, సంక్రాంతి సంబురాలు ముగిసిపోయాయి. పండగ ఆనందంలో పరిమితికి మించి తింటాం. వింతవింత వంటకాలు, వివిధ పానీయాలు మన పొట్టలో చేరుకుంటాయి. పన్లో పనిగా మన వంటికి పడని పదార్థాలూ పేరుకుంటాయి. వీటిని వదిలించుకోడానికి డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవాలని చెబుతారు నిపుణులు.
దసరా, దీపావళి, సంక్రాంతి సంబురాలు ముగిసిపోయాయి. పండగ ఆనందంలో పరిమితికి మించి తింటాం. వింతవింత వంటకాలు, వివిధ పానీయాలు మన పొట్టలో చేరుకుంటాయి. పన్లో పనిగా మన వంటికి పడని పదార్థాలూ పేరుకుంటాయి. వీటిని వదిలించుకోడానికి డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవాలని చెబుతారు నిపుణులు.
Detox Drinks | ఆరోగ్యకరమైన జీవితం కోసం శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని సూచిస్తారు వైద్యులు. మామూలుగా అయితే, మంచినీళ్లతోనే శరీరం డీటాక్సిఫై అవుతుంది. అదనంగా పండ్లో, కూరగాయలో, మూలికలో జోడించి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయి. డీటాక్స్ డ్రింక్స్‌గా పేర్కొనే పానీయాలతో శరీర బరువూ తగ్గుతుంది. పీహెచ్ విలువ సమతూకంలో ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. శక్తి స్థాయులు పెరుగుతాయి.
డీటాక్స్ డ్రింక్స్ ఎందుకు?
రోజువారీగా తాగే నీళ్లకు డీటాక్స్ డ్రింక్స్ సహాయకారిగా ఉంటాయి. శరీరానికి వివిధ రకాలైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ అందుతాయి. చక్కెర అధికంగా ఉండే శీతల పానీయాల కంటే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.
ఏవి వద్దు?
డీటాక్స్ వాటర్ తయారీలో కొన్ని పదార్థాలను చేర్చకూడదు. చక్కెర ఎక్కువగా ఉండకూడదు. దీనివల్ల డీటాక్స్ వాటర్ ప్రయోజనాలు శరీరానికి అందవు. కృత్రిమ చక్కెరలు, ప్రాసెస్ చేసిన పండ్లరసాలు డీటాక్స్ వాటర్‌లో
కలపకూడదు. ఉప్పు ఎక్కువగా ఉండకూడదు. ఇది శరీరంలో నీళ్లను పట్టి ఉంచుతుంది.
ఏ సమయంలో?
పొద్దున్నే తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లు తాగితే శరీర జీవక్రియలు వెంటనే మొదలైపోతాయి. భోజనానికి ముందు డీటాక్స్ వాటర్ తాగితే ఆకలి అదుపులోకి వస్తుంది. వ్యాయామం తర్వాత తాగినా మంచిదే.
ఎన్ని గంటల వరకు నిల్వ?
డీటాక్స్ వాటర్‌లో వాడే పదార్థాలను బట్టి అవి ఎంతకాలం నిల్వ ఉంటాయనేది ఆధారపడి ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచితే ఒకటి రెండు రోజుల వరకు తాజాగా ఉంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద అయితే తయారుచేసిన కొన్ని గంటల్లోనే తాగేయాలి.
ఎలా తాగాలి?
ఒక్క గుక్కలో తాగకూడదు. నెమ్మదిగా తాగాలి. రాగి, వెండి లేదంటే గాజు గ్లాసులో తాగాలి. గోరువెచ్చగా లేదంటే గది ఉష్ణోగ్రత దగ్గర నీళ్లను తాగితే మంచిది. భోజనం మధ్యలో మాత్రం తాగకూడదు. ఇలాచేస్తే అన్నం అరుగుదలలో ఇబ్బంది
ఎదురవుతుంది.
1. నిమ్మ – కీరదోస
డీటాక్స్ వాటర్తరిగిన కీరదోస, నిమ్మరసం, పుదీనా ఆకులను నీళ్లకు కలుపుకోవాలి. నిమ్మలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు నీళ్లలో పోషకాలను పెంచుతాయి.
2. పసుపు – అల్లం
తరిగిన అల్లం, చిటికెడు పసుపు, నిమ్మరసం నీళ్లకు జోడించాలి. అల్లం అరుగుదలకు సహాయకారి. పసుపులో ఉండే కర్క్యుమిన్ మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు కారణమయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌ను వదలగొడుతుంది.
3. బెర్రీ బ్లాస్ట్
వివిధ బెర్రీలు, నిమ్మ ముక్కలను నీళ్లకు కలుపుకోవాలి. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న ఈ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి.
4. పుదీనా – పుచ్చపండు
పుచ్చపండు ముక్కలు, తాజా పుదీనా ఆకులు, నిమ్మరసం నీళ్లలో కలుపుకోవాలి. పుచ్చపండు నుంచి విటమిన్-ఎ, సి, పుదీనా ఆకుల నుంచి వికారం పోగొట్టే లక్షణాలు శరీరానికి అందిస్తుందీ పానీయం. పరిపూర్ణమైన డీటాక్స్ డ్రింక్ ఇది.
5. యాపిల్ సిడెర్ వినెగర్
నీళ్లలో ఒక టీస్పూన్ యాపిల్ సిడెర్ వినెగర్, నిమ్మరసం, తేనె కలుపుకోవాలి. ఇది శరీరంలో క్యాలరీలను తగ్గిస్తుంది.
6. సిట్రస్ మెడ్లీ
నీళ్లలో నిమ్మజాతి పండ్ల ముక్కలు వేసుకుని తాగాలి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ.
7. కొత్తిమీర (సిలాంట్రో) – నిమ్మ
నీళ్లలో కొత్తిమీర ఆకులు, నిమ్మ ముక్కలు కలుపుకొని తాగితే శరీరంలో కణాల విచ్ఛిత్తి ఆగిపోతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

