‘హాయ్ గూగుల్.. ప్లే ద ప్రీవియస్ ఎపిసోడ్. వాల్యూమ్ అప్.. చేంజ్ ద చానెల్!’ అని కమాండ్ చేస్తూ స్మార్ట్ టీవీ వీక్షిస్తున్నాం. వాయిస్ కమాండ్స్, స్ట్రీమింగ్ యాప్స్, పర్సనలైజ్డ్ రికమెండేషన్స్.. ఇవన్నీ తెగ వాడేస్తున్నాం. కానీ ‘ఈ స్మార్ట్ టీవీ నిజంగా ఎంత డేటా సేకరిస్తున్నది? మనం ఏం చూస్తున్నామో, ఎప్పుడు చూస్తున్నామో, ఎవరితో చూస్తున్నామో ట్రాక్ చేస్తున్నదా?’ అని ఒక్క క్షణం ఆలోచించారా! ఈ ప్రశ్నలకు ఇప్పుడు కలవరపెట్టే సమాధానాలు వినిపిస్తున్నాయ్.
స్మార్ట్ టీవీల్లో ఉన్న ట్రాకింగ్ ఫీచర్స్, ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నిషన్ (ACR) టెక్నాలజీ, డేటా కలెక్షన్ ప్రాక్టీసెస్ ఆ కోవలోకే వస్తాయి. స్మార్ట్ టీవీలు కేవలం మనం ఏం చూస్తున్నామో మాత్రమే కాదు, చాలా ఎక్కువ డేటా సేకరిస్తాయని చాలామందికి తెలియదు. ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నిషన్ (ACR) అనే టెక్నాలజీ ద్వారా, టీవీ స్క్రీన్‌పై కనిపించే కంటెంట్‌ని గుర్తించి, దాని గురించి డేటా సేకరిస్తుంది. ఇందులో మీరు చూసే షోస్, మూవీస్, యాడ్స్, యూట్యూబ్ వీడియోస్, గేమింగ్ సెషన్స్.. ఇలా ప్రతిదీ ఉంటుంది.

Smart Tv
ACR (Auto Content Recognition) టెక్నాలజీ ద్వారా, మీ టీవీ కొన్ని సెకన్లకు ఒకసారి స్క్రీన్ షాట్ తీస్తుంది. ఈ డేటా సర్వర్కి వెళ్తుంది. అక్కడ మీ వ్యూయింగ్ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది! ACR టెక్నాలజీ మీ వ్యూయింగ్ హ్యాబిట్స్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది. ఈ డేటా అంతా అడ్వైర్టెజర్స్కి, కంటెంట్ ప్రొవైడర్స్‌కి చేరిపోతుంది. మీరు అనుకున్నదానికంటే చాలా ఎక్కువ డేటా షేర్ అవుతుంటుంది.
ఎవరు వాడుతారు?
టార్గెటెడ్ అడ్వైర్టెజింగ్: మీరు కిడ్స్ షోస్ చూస్తే.. టాయ్స్ యాడ్స్. ఫిట్నెస్ వీడియోస్ చూస్తే.. హెల్త్ ప్రొడక్ట్స్ యాడ్స్ వెల్లువెత్తుతాయి!
డేటా బ్రోకరింగ్: మీ వ్యూయింగ్ డేటాని థర్డ్‌పార్టీ కంపెనీస్‌కి విక్రయిస్తారు. ఇవి మీ ప్రొఫైల్ క్రియేట్ చేసి, ఇతర డేటా సోర్సెస్‌తో కలిపి, డీటెయిల్డ్ పర్సనల్ ప్రొఫైల్స్ బిల్డ్ చేస్తాయి.
సెక్యూరిటీ రిస్క్: స్మార్ట్ టీవీలు IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) డివైజెస్. ఎవరైనా హ్యాక్ చేస్తే, మీ ఇంట్లో ఏం జరుగుతున్నదో
చూడవచ్చు, వినవచ్చు. కెమెరా, మైక్ ఉన్న టీవీలతో ఈ రిస్క్ మరింత ఎక్కువ.
ట్రాక్ అయ్యే డేటా
యాక్షన్ స్టెప్స్
సెట్టింగ్స్ రివ్యూ: టీవీ సెట్టింగ్స్‌లో ప్రైవసీ ఆప్షన్స్ చెక్ చేయండి. ACR ట్రాకింగ్, డేటా షేరింగ్, యాడ్ పర్సనలైజేషన్ని డిసేబుల్ చేయండి.
నెట్వర్క్ సెగ్మెంటేషన్: స్మార్ట్ టీవీని గెస్ట్ నెట్వర్క్ లేదా సెపరేట్ VLANకి కనెక్ట్ చేయండి. ఇతర డివైజెస్ ప్రొటెక్ట్ అవుతాయి.
ఫిజికల్ కవర్స్: కెమెరా ఉంటే ఫిజికల్ కవర్ లేదా స్టిక్కర్ పెట్టండి. మైక్‌ని డిసేబుల్ చేయగలిగితే చేయండి.
రెగ్యులర్ అప్డేట్స్: టీవీ సిస్టమ్ సాఫ్ట్వేర్ లేటెస్ట్ వెర్షన్లో ఉంచండి. సెక్యూరిటీ ప్యాచెస్ మీ డివైస్‌ని ప్రొటెక్ట్ చేస్తాయి.
స్మార్ట్ ప్రైవసీ ముఖ్యం!
స్మార్ట్ టీవీలలో ట్రాకింగ్ ఫీచర్స్ ఉండటం మనకు కలవరం కలిగించవచ్చు. అంతమాత్రానికే పానిక్ అవ్వకూడదు. అవేర్నెస్ ఉండటం ముఖ్యం. అతి భయం కూడా మంచిది కాదు. మనం టెక్నాలజీని ఎంత ఆశ్రయించినా.. చివరికి మన ప్రైవసీ, డేటా సెక్యూరిటీ మనకు ముఖ్యం! స్మార్ట్ టీవీలు మన లైఫ్‌ని ఈజీ చేయాలి. కాంప్లికేట్ చేయకూడదు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే.. మనం టెక్నాలజీ ప్రయోజనాలను సేఫ్‌గా ఎంజాయ్ చేయవచ్చు!