ఓట్ ఫర్.. పటాస్ రతిక!
బిగ్‌బాస్ అంటే వివాదాలు గుర్తొస్తాయి. ఆటలో లీనమైపోయే కంటెస్టెంట్స్ కనిపిస్తారు. తరచూ జరిగే ఓటింగ్ మదిలో మెదులుతుంది. అంతిమంగా విజేత కళ్లముందు నిలుస్తారు. తాజా సీజన్.. బిగ్‌బాస్-7లో తన ప్రతిభను చాటుతూవిన్నర్గా నిలవాలని కలలుకంటున్నది తెలంగాణ యువతి.. రతిక.
బిగ్‌బాస్ అంటే వివాదాలు గుర్తొస్తాయి. ఆటలో లీనమైపోయే కంటెస్టెంట్స్ కనిపిస్తారు. తరచూ జరిగే ఓటింగ్ మదిలో మెదులుతుంది. అంతిమంగా విజేత కళ్లముందు నిలుస్తారు. తాజా సీజన్.. బిగ్‌బాస్-7లో తన ప్రతిభను చాటుతూవిన్నర్గా నిలవాలని కలలుకంటున్నది తెలంగాణ యువతి.. రతిక.
తనేం సెలెబ్రిటీల కుటుంబంలో పుట్టలేదు. సినిమా పరిశ్రమలో గాడ్‌ఫాదర్లూ లేరు. అయినా, పట్టుదలతో పాముల్ని దాటుతూ.. ఒడుపుగా నిచ్చెనలు ఎక్కుతూ అవకాశాలను అందుకుంటున్నది ప్రియాంక. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని జనగాం ప్రియాంక అలియాస్ రతిక రోజ్ సొంతూరు. తను తాజాగా బిగ్‌బాస్-7లో ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని నాగార్జున ప్రధాన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోలో.. మొత్తం 14 మంది హౌజ్‌లో ఉన్నారు. అందులో పదో కంటెస్టెంట్‌గా ‘చమ్కీల అంగీలేసి’ పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది రతిక రోజ్.
డ్యాన్స్ టు రియాలిటీ
రతిక రోజ్.. తండ్రి పుల్లమోళ్ల రాములు యాదవ్ పక్కా రైతు. మండల స్థాయిలో చురుకైన రాజకీయ నాయకుడు. తల్లి అనితారాణి. ఈ దంపతులకు ముగ్గురు కూతుర్లు. రతిక రెండో అమ్మాయి. తను పదో తరగతి వరకు తాండూరులోని గంగోత్రి విద్యాలయంలో చదివింది. ఇంటర్మీడియట్ జవహర్ నవోదయ విద్యాలయ-గచ్చిబౌలిలో పూర్తి చేసింది. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి బీటెక్ పట్టా అందుకుంది. రతికకు బాల్యం నుంచీ డ్యాన్స్ అంటే ప్రాణం. నటనపైనా ఆసక్తి పెంచుకుంది. ఎదిగేకొద్దీ వెండితెర ఆమెను అయస్కాంతంలా ఆకర్షించసాగింది. తొలుత మాడలింగ్ వైపు అడుగులు వేసింది. ఈటీవీ ప్లస్‌లో ‘పటాస్’ పేరుతో ఓ షో కూడా చేసింది. దీంతో గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఓ సాధారణ యువతి ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప విజయమే.
మీ ఓటు నాకే..
బిత్తిరి సత్తి హీరోగా వచ్చిన ‘తుపాకీ రాముడు’ రతిక తొలి సినిమా. ‘కార్తికేయ 2’, ‘ఖయ్యుం భాయ్’, ‘నారప్ప’, ‘దృశ్యం 2’ తదితర సినిమాల్లో నటించింది. తాజాగా బెల్లంకొండ గణేష్ హీరోగా ‘నేను స్టూడెంట్ సార్’ మూవీలో పోలీస్ అధికారి పాత్ర పోషించింది. రతికకు ఇన్‌స్టాగ్రామ్‌లో 146కే ఫాలోవర్స్ ఉన్నారు. ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలనే ఉద్దేశంతో బిగ్‌బాస్-7లో పాల్గొంటున్నట్టు వెల్లడించింది. ‘బిగ్‌బాస్ రియాలిటీ షోలో నా కూతురు రతిక ఆటను ఎంజాయ్ చేయండి. ఓటు వేసి మీ మద్దతు తెలపండి’ అంటూ
వీక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నారు పుల్లమోళ్ల రాములు. స్పందించండి మరి. 888 66 76 908 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.
…? గౌసుద్దీన్
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

