Household Tips | పండ్లు, కూరగాయలపైన ఉండే రసాయనాలు పోవాలంటే ఇలా చేయండి!
Household Tips | బేకింగ్ సోడా... చాలా ఇళ్లలో ఉండేదే. మైసూర్ బజ్జీలు పొంగడానికి, బిస్కెట్ల తయారీలో ఎక్కువగా వాడే ఈ బేకింగ్ సోడాతోచాలా ఉపయోగాలే ఉన్నాయి.
Household Tips | బేకింగ్ సోడా… చాలా ఇళ్లలో ఉండేదే. మైసూర్ బజ్జీలు పొంగడానికి, బిస్కెట్ల తయారీలో ఎక్కువగా వాడే ఈ బేకింగ్ సోడాతోచాలా ఉపయోగాలే ఉన్నాయి.
ఫ్లవర్ వాజ్లో నీరుపోసి, ఓ టీస్పూన్ బేకింగ్ సోడా వేసి… అందులో పూలను కాడలతో ఉంచితే అవి తాజాగా ఉంటాయి. నీటి నుంచి నిలవ వాసన కూడా రాదు.
వంటపాత్రలలో వేడి నీరు పోసి, అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి కాసేపు నానబెట్టి కడిగితే… పాత్రలు మురికి పోయి తళతళలాడతాయి.
పాత్రలకు ఉల్లి, వెల్లుల్లి లాంటి పదార్థాల వాసన పోవాలంటే బేకింగ్ సోడాతో రుద్దితే సరి.
బేకింగ్ సోడాను తడి చేసి, ఆ పేస్ట్‌తో ఫ్రిజ్‌ని తుడిస్తే లోపల ఉన్న దుర్వాసన పోతుంది. ఒక చిన్న గిన్నెలో ఈ పేస్టును ఫ్రిజ్‌లో ఉంచితే.. చెడు వాసన ఏర్పడదు.
బేకింగ్ సోడా కలిపిన నీటితో పండ్లు, కూరగాయలను కడిగితే…వాటిమీద ఉండే రసాయనాలు, మురికి పోతాయి.