అపూర్వ.. పేరులోనే పూర్వాపరాలు ఉన్నాయి. ఇంతకు పూర్వం ఇంత అందగత్తె లేనేలేదని అర్థం. నిజమే తనది సహజ సౌందర్యం. గాజుల్లేవు. అయితేనేం, ఆ చేతులు తామర తూళ్లను తలపిస్తున్నాయి. మెడలో హారం లేదు. అయినా లోటు తెలియదు.
సృష్టికర్త సాక్షాత్తు శంఖాన్ని ప్రతిష్ఠించినట్టు ఉంది. ఓ చేతికి రెండు ఉంగరాలు. నేడు నాదే, రేపూ నాదే.. అనే భరోసాకు చిహ్నం కావచ్చు. పసుపు పచ్చని చీర.. సౌభాగ్యానికి గుర్తు. ఇంకేముంది.. ‘హ్యాపీ ఎండింగ్’ కథానాయిక వైభవం అపూర్వం.