దూరం.. దూరం
సముద్రంలో అన్ని చేపల్లానే పఫర్ చేప కూడా తన దారిన తాను ఈదుతూ వెళ్లిపోతుంటుంది. చిన్న చేపను పెద్ద చేప మింగడం సముద్ర న్యాయమే అనుకుని కొన్ని మీదపడుతుంటాయి. అలాంటివి దగ్గరకు వచ్చినప్పుడు మిగతా చేపల్లా పఫర్ చేప మడమ చూపి పారిపోదు. ‘రా! నీ సంగతి చూస్తా’ అన్నట్టు అక్కడే ఆగిపోతుంది.
సముద్రంలో అన్ని చేపల్లానే పఫర్ చేప కూడా తన దారిన తాను ఈదుతూ వెళ్లిపోతుంటుంది. చిన్న చేపను పెద్ద చేప మింగడం సముద్ర న్యాయమే అనుకుని కొన్ని మీదపడుతుంటాయి. అలాంటివి దగ్గరకు వచ్చినప్పుడు మిగతా చేపల్లా పఫర్ చేప మడమ చూపి పారిపోదు. ‘రా! నీ సంగతి చూస్తా’ అన్నట్టు అక్కడే ఆగిపోతుంది. ఆత్మరక్షణ కోసం తన శరీరాన్ని అమాంతం ఉబ్బించేస్తుంది. దాని ఒంటిపై ముళ్లు నిక్కబొడుచుకుంటాయి. ఇంకేముంది ఆ చేపను మింగలేక పెద్ద చేప దూరంగానే ఉండిపోతుంది. పఫర్ ఫిష్ చేసే ఈ ఆత్మ రక్షణ వ్యూహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. స్మార్ట్ ఫోన్లు, డేటింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక రిలేషన్స్ మారిపోతున్నాయి.
కొత్త పరిచయాలతో కొత్త ప్రయాణాలు మొదలుపెడుతున్నారు చాలామంది. పరిచయంలో ఉన్న మాటలు, ఆత్మీయత కొంతకాలం కలిసి ఉన్న తర్వాత మారిపోతున్నాయి. అప్పుడు భాగస్వామి నుంచి తనను తాను కాపాడుకునేందుకు పఫర్ చేపనే ఆదర్శంగా తీసుకుంటున్నారు. కొంతకాలం కలిసి మెలిసి తిరిగిన వ్యక్తి పట్ల పూర్తి నమ్మకం ఉంటుంది. వాళ్ల మాటల్లో మార్పులు, చేష్టల్లో తప్పులు కనిపిస్తుంటే ఆ రిలేషన్షిప్ని కొనసాగించాలా? వద్దా? అనే సందేహం తలెత్తినప్పుడు తెలివిగా వ్యవహరిస్తున్నారు.
ఆ బంధాన్ని వెంటనే తెంచుకుని దూరంగా పోకుండా, పూర్తిగా అవతలి వారిపై ఆధారపడి మరింత లోతులోకి కూరుకుపోయి మోసపోకుండా ఉండేందుకు ఆత్మరక్షణ వ్యూహం పాటిస్తున్నారు. ‘పఫర్ ఫిషింగ్’ మోడ్లోకి వెళ్లిపోతున్నారు. పార్ట్నర్కు కొంత దూరం పాటిస్తున్నారు. వారితో బంధం మరింత పెనవేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కీడెంచి మేలెంచడం మంచిదే! కాబట్టి, సందేహం కలిగితే ఈ ఆత్మరక్షణ సరైనదే. కానీ, ప్రతి చిన్న విషయానికీ ఇదే పాటిస్తానంటే మాత్రం పెద్ద ప్రమాదమే.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- dating apps
- Fish
- pufferfish
- sea
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

