ఎర్రటి మిర్చీని చూస్తే ఎవరికైనా ఘాటే గుర్తొస్తుంది. అందుకే పండుమిరప రంగు.. ఎప్పుడూ
హాటే. ఇది చాలా హాట్ గురూ అనాలంటే… అక్కడ ‘రెడ్’సిగ్నల్ ఏదో ఒకటి కనిపించాల్సిందే! అరుణ వర్ణానికి తరుణి సోకునూ రంగరించి…
రమణీయంగా కనిపిస్తున్నది ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించిన కాక్టెయిల్ గౌను. నడుము భాగాన్ని హైలైట్ చేస్తూ షిఫాన్ సిల్కు వస్త్రంతో తీర్చిదిద్దిన ఈ గౌను పార్టీలుక్కి పర్ఫెక్ట్. డ్రెస్‌కి తగ్గ లిప్‌స్టిక్, జుంకాలూ ధరించి వేడుకకే వెలుగులు తెచ్చేలా మెరిసిపోతున్నది నటి శోభితా ధూళిపాళ.