టిక్‌టాక్ వీడియోలతో పాపులరై.. టిప్‌టాప్‌గా తెరంగేట్రం చేసిన నటి మృణాళిని రవి. భారీ హిట్లు కొట్టకున్నా.. ఓరచూపుల ఈ తమిళ అమ్మడిని సినిమా అవకాశాలు పలకరిస్తూనే ఉన్నాయి. తాజాగా విజయ్ ఆంటోనీ సరసన ‘లవ్ గురూ’లో ప్రేమికగా అలరించడానికి సిద్ధమైంది. మామిడిపండు వన్నె చీరలో గున్నమామిడిలా ముస్తాబైన ఈ చిన్నదాన్ని చూసి.. వసంతం రాకముందే ప్రకృతి పరవశించినట్టు లేదూ!
సి.ఎం. ప్రవీణ్