పువ్వులు, లతలు ఎక్కడున్నా.. ముగ్ధ మనోహరంగా కనిపిస్తూ మనసుకు హాయిగొలుపుతాయి. అందుకే చీరలు మొదలు చుడీదార్ల దాకా అన్నిటిమీదా ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబించే డిజైన్లు ముద్రిస్తుంటారు. నీలిరంగు వస్త్రం మీద ఆకుపచ్చ, గులాబీ, పసుపు వన్నెల ఆకులూ, పుష్పాలూ అచ్చేసిన జార్జెట్ కుర్తీలో ఇక్కడ మెరిసిపోతున్నది సినీనటి మాళవిక నాయర్.
వెండిరంగు మిర్రర్ చమ్కీ, దాంతోపాటు హ్యాండ్ ఎంబ్రాయిడరీ దుస్తులకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. చేతులు, నడుం చుట్టూ టాజిల్ వర్క్ వస్త్ర సోయగానికి వన్నెలద్దుతున్నది. డ్రెస్‌కు మ్యాచింగ్ దుపట్టా, తెలుపు-బంగారు వర్ణాల రాళ్లు పొదిగిన చెవిపోగులతో ప్రకృతి కాంతలా కనిపిస్తున్నదీ కేరళ కుట్టి!