వర్ణాలెన్ని ఉన్నా.. నలుపులో ఉన్న విరుపే వేరు! పసిమివన్నె ఛాయ ఉన్న ముగ్ధ నలుపు టాపు వేసుకుంటే వలపు గెలుపు పాఠాలు నేర్చుకుంటుంది. సీతమ్మ వాకిట్లో విరిసిన సిరిమల్లెగా మన్ననలు అందుకున్న అంజలి అదే వన్నె దుస్తుల్లో తళుక్కుమన్నది. కాటుక నలుపు డ్రెస్‌పై పాల తెలుపు థ్రెడ్స్తో చేసిన సెక్విన్ వర్క్ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనిపించేలా ఉంది కదూ! తెలుగుదనం నిండుగా ఉండే ఈ పుత్తడి బొమ్మ చీరకట్టులోనే కాదు ఏ ఫ్యాషన్ వేర్ వేసుకున్నా కనికట్టు చేయడం ఖాయం.
– సి.ఎం. ప్రవీణ్