పల్లెమట్టిలోంచి పుట్టి.. ఖండాంతరాలు దాటి ఆస్కార్ అందుకున్నది ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట. ఈ పాటతో తెలంగాణ బిడ్డ సత్తాను లోకానికి చాటి చెప్పిన గీత రచయిత చంద్రబోస్‌ను ఆయన పుట్టినగడ్డ ఘనంగా సత్కరించనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో ఈ రోజు చంద్రబోస్‌కు ఘన సన్మానం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా, చిన్నప్పుడు తాను కీర్తనలు విన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు చంద్రబోస్. తర్వాత పాఠశాల మైదానంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అంతర్జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న సంతోషాన్ని.. పుట్టిన ఊరుతో పంచుకోవడం ఆనందంగా ఉందంటున్నారు ఈ అవార్డు గీత రచయిత.