Karthika Masam | దేవుడింటికి కొత్త కళను తీసుకొస్తున్న గాజు కుందులు
చుక్కపొద్దు పొడవకముందే చుక్కలాంటి దీపాలు వెలుగుతాయి కార్తిక మాసంలో. తొలిమలి సంధ్యలు.. ప్రమిదల్లో తళుక్కుమనే దివ్వెల్లోనే దర్శనమిస్తాయి. దీపావళి పండుగతో మొదలయ్యే దీపకాంతుల శోభ కార్తికం ఆసాంతం కనువిందు చేస్తుంది.
Karthika Masam | చుక్కపొద్దు పొడవకముందే చుక్కలాంటి దీపాలు వెలుగుతాయి కార్తిక మాసంలో. తొలిమలి సంధ్యలు.. ప్రమిదల్లో తళుక్కుమనే దివ్వెల్లోనే దర్శనమిస్తాయి. దీపావళి పండుగతో మొదలయ్యే దీపకాంతుల శోభ కార్తికం ఆసాంతం కనువిందు చేస్తుంది. దానికి మరింత నూతనత్వాన్ని ఆపాదిస్తూ అందమైన గాజు కుందులు మార్కెట్లో తయారవుతున్నాయి. ఒక్క ప్రమిదలే కాదు, పూజాసెట్ మొత్తం గాజుతోనే తయారై దేవుడింటికి కొత్త కళను తీసుకొస్తున్నాయి.
దీపారాధన రోజూ చేసేదే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక, కార్తిక మాసం అచ్చంగా దీపాలకు ప్రత్యేకం. సూర్యోదయానికి మునుపే ఇంటా బయటా ప్రత్యక్షమయ్యే ఇవి కార్తికానికి కాంతుల తోరణాలు కడతాయి. మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం, ఇత్తడి కుందుల్లో దీపారాధన చేయడం మనకు అలవాటే. అందులోనే వినూత్నతను చాటేలా గాజుతో చేసిన దీపపు చెమ్మెలు ఇప్పుడు తయారవుతున్నాయి. పూర్తి పారదర్శకమైనవి మొదలుకొని విభిన్న రంగుల్లో ఎన్నో రకాలు ఉన్నాయిందులో.

నచ్చినట్టు…
దీపారాధనలో రెండు వత్తులు మొదలు అయిదు వత్తుల దాకా వేసి వెలిగించే వాళ్లుంటారు. దేవుడికి రెండు వైపులా పెద్ద దీపపు కుందులు పెట్టుకుని అలంకరించుకునే వాళ్లూ ఉంటారు. కుంభ వత్తులు వెలిగించుకునే అలవాటు మరికొందరిది. ఎవరి ఇష్టాన్నీ అభిరుచినీ బట్టి వాళ్లు దీపాలు వెలిగించుకునేలా రకరకాల గాజు కుందులు ముస్తాబవుతున్నాయి. ఈ దీపాలకు అలంకారంగా నెమలి, హంస, గణపతిలాంటి బొమ్మలు వస్తున్నాయి. బోరోసిలికేట్తో చేసిన అచ్చంగా పారదర్శకమైన వాటితోపాటు ఆర్ట్ గ్లాస్‌తో చేసిన రంగుల ప్రమిదలూ వీటిలో ఉంటున్నాయి.
ఇక, అచ్చంగా పూజాసెట్ మొత్తం గాజుతో కావాలనుకున్నా దొరుకుతున్నాయి. పసుపు, కుంకుమ, గంధం గిన్నెలతో పాటు పంచపాత్ర, ఉద్ధరిణి, గంట, అగరొత్తుల స్టాండు, పన్నీరు బుడ్డి కూడా నాజూగ్గా గాజుతోనే తయారవుతున్నాయి. వీటిలోనూ విభిన్న డిజైన్లూ, రంగుల కలయికలతో సెట్లు దొరుకుతున్నాయి. ప్లాస్టిక్‌వి కాదు కాబట్టి కడిగి దాచుకుంటే ఎన్ని రోజులైనా హాయిగా వాడుకోవచ్చు. దగ్గరి వారికి బహుమతిగా ఇచ్చేందుకూ ఇవి బాగుంటాయి. గాజు సొగసుల్లో కార్తిక కాంతి కొంగొత్తగా వెలిగిపోవడంలేదూ!



Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

