మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
తనతో ఫొటో దిగాలన్న బాలుడి కోరికను కేటీఆర్ నెరవేర్చి బాలుడిలో ఎనలేని సంతోషాన్ని నింపారు. ఎన్నో రోజుల నుండి పరోక్షంగా కేటీఆర్‌ను టీవీలో చూస్తున్న బాలుడు స్వయంగా కేటీఆర్‌తో ఫొటో దిగాలనే కోరికను పదేపదే వెలిబుచ్చుతుండగా ఆ కోరికను పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి...
– బాలుడు అఖిల్ కోరికను నెరవేర్చిన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి
– కేటీఆర్‌తో ఫొటో దిగి ఆనందం వ్యక్తం చేసిన బాలుడు
ఖమ్మం రూరల్, అక్టోబర్ 27 : తనతో ఫొటో దిగాలన్న బాలుడి కోరికను కేటీఆర్ నెరవేర్చి బాలుడిలో ఎనలేని సంతోషాన్ని నింపారు. ఎన్నో రోజుల నుండి పరోక్షంగా కేటీఆర్‌ను టీవీలో చూస్తున్న బాలుడు స్వయంగా కేటీఆర్‌తో ఫొటో దిగాలనే కోరికను పదేపదే వెలిబుచ్చుతుండగా ఆ కోరికను పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి నెరవేర్చారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామానికి చెందిన దరిపెల్లి అఖిల్ అనే బాలుడు గత కొద్ది రోజుల నుండి కేటీఆర్ ను చూడాలనే కొరికను బలంగా కలిగి ఉన్నాడు. కుటుంబ సభ్యులకు, ఇంటికి వచ్చిన వాళ్లందరికీ పదేపదే విషయం చెప్పి తన కోరికను వెలిబుచ్చుతుండేవాడు. అఖిల్ మనసులో ఉన్న కోరికను ఎలాగైనా తీర్చాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఈ నెల 18న ఖమ్మం జిల్లా కేంద్రం తెలంగాణ భవన్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని కలిసి బాలుడి కోరికను వివరించారు.

మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
దీంతో స్పందించిన కందాల మంగళవారం అఖిల్ తో పాటు కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు రప్పించారు. వారిని వెంట తీసుకుని తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడ కేటీఆర్ ను చూసిన అఖిల్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. స్వయంగా కేటీఆర్ బాలుడితో సెల్ఫీ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలోనే కేటీఆర్ పదేపదే నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు, వైద్య సహాయం, ఇతర ఏ సహాయం కావాలన్నా చేస్తా అని చెప్పినప్పటికీ నాకు ఏమీ వద్దు సార్. మీరు ముఖ్యమంత్రి కావాలి, తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు అని అనడంతో కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిల్ కుటుంబ సభ్యులు కేటీఆర్, కందాలకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
Rizwan Basha Shaik | సీఎంఆర్ బియ్యం అప్పగించాల్సిందే.. మిల్లర్లకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరిక
సుందరయ్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్
పనకబండలో ఇంటింటికి ఫామ్-18 స్లిప్పుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

